కరోనా ఎక్కడ పుట్టింది. ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. కరోనా చైనా లో పుట్టిందన్న విషయం ప్రపంచం మొత్తం నమ్మింది. అయితే చైనా కావాలనే ఈ వైరస్‌ను పుట్టించిందని.. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిందని ఆరోపణలు వచ్చాయి. అమెరికా సహా అగ్రదేశాలన్నీ ఇదే ఆరోపణలు బలంగా వినిపించాయి. అయితే చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లోనే కరోనా పుట్టిందని కొందరు.. అక్కడి మాంస విక్రయశాలలో పుట్టిందని మరికొందరూ వాదిస్తూ వచ్చారు. కరోనా ఎక్కడ పుట్టిందో తేల్చాలంటూ డబ్ల్యూహెచ్ వో మీద కూడా ఆరోపణలు వచ్చాయి. సదరు సంస్థ మీద ఒత్తిడి పెరిగింది. దీంతో డబ్ల్యూహెచ్ వో ప్రతినిధి బృందం చైనాకు బయలుదేరింది. అక్కడి వూహాన్ సిటీలో పర్యటించింది.
అయితే కరోనా వైరస్ చైనా లోని వైరాలజీ ల్యాబ్ లో పుట్టలేదని అక్కడి.. వన్యప్రాణుల పెంపకం కేంద్రాల నుంచి పుట్టి ఉంటుందని డబ్ల్యూహెచ్‌కు చెందిన సభ్యుడు సభ్యుడు పీటర్ డస్ బాక్ అంటున్నారు. వూహాన్‌లోని ల్యాబ్ లో ఈ వైరస్ పుట్టే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకొనేందుకు ఇటీవల డబ్ల్యూహెచ్‌వో బృందం వూహాన్ లో పర్యటించింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను తేల్చింది.
దక్షిణ చైనాలో వన్యప్రాణుల్ని పెంపకం కేంద్రాల నుంచి వూహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌కి తరలిస్తూ ఉంటారని, దీనికి సంబంధించి తమ పర్యటనలో ఆధారాలు లభించాయని పీటర్ తెలిపారు.అమెరికన్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పీటర్ పలు కీలక విషయాలను తేల్చారు. అయితే వూహాన్‌లోని మాంస విక్రయశాలలో కరోనా వైరస్ తొలిసారిగా పుట్టింది. అయితే వన్య ప్రాణుల పెంపకం కేంద్రాల నుంచి పంపిన జంతువుల ద్వారా కరోనా వైరస్ మనుషుల్లోకి వచ్చి ఉంటుందనే పీటర్ అంచనా వేశారు.
చైనా ప్రభుత్వం వన్య ప్రాణుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. పాంగోలిన్స్, పార్క్‌పైన్స్, పునుగు పిల్లులు, రాకూన్ శునకాలు, బాంబూ ఎలుకలు వంటి జంతువులను అక్కడి ప్రజలు పెంచుతుంటారు. ఈ జంతువుల నుంచే వైరస్ వచ్చి ఉంటుందని డబ్ల్యూహెచ్ ఓ అభిప్రాయ పడింది. అయితే ఈ విషయాన్ని ఇంతవరకు డబ్ల్యూహెచ్ వో అధికారికంగా ధ్రువీకరించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు బయట పడే అవకాశం ఉంది.