పాస్‌ పోర్టులు ఇవ్వ‌డం స‌రికాదు: దేశాల తీరును త‌ప్పుబ‌ట్టిన డ‌బ్ల్యూహెచ్ ఓ

Update: 2020-04-26 07:19 GMT
క‌రోనా వైర‌స్ కేసులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల్లో చేరుకున్నాయి. వాటి బారిన ప‌డి వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృత్యువాత చెందుతుండ‌గా కోలుకున్న వారి సంఖ్య కూడా వేల‌ల్లోనే ఉంటుంది. అయితే క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారి పాస్‌ పోర్టులు - రిస్క్ ఫ్రీ స‌ర్టిఫికెట్లు వారికి ప‌లు దేశాల్లో తిరిగి ఇస్తున్నారు. ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) త‌ప్పుబ‌ట్టింది. ఆ వైర‌స్ బారిన ప‌డి కోలుకున్న వారికి మ‌ళ్లీ వైర‌స్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని.. ఇలాంటి స‌మ‌యంలో వారికి పాస్‌ పోర్టులు - రిస్క్ ఫ్రీ స‌ర్టిఫికెట్లు ఇస్తార‌ని ప్ర‌శ్నించింది.

కరోనా వైర‌స్ మ‌ళ్లీ వారికి సోకే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింద‌ని గుర్తుచేసింది. వారికి మ‌ళ్లీ వైర‌స్ రాద‌నే ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఆ విధంగా పాస్‌ పోర్టులు - రిస్క్ ఫ్రీ స‌ర్టిఫికెట్లు అందిస్తే వారు వివిధ ప్రాంతాలు తిరిగితే వారికి వారితో పాటు ఇత‌రుల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని హెచ్చ‌రించింది. చిలీ త‌దిత‌ర దేశాల్లో క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారు కార్యాల‌యాలు వెళ్లడానికి - ప్రయాణాలు చేయడానికి ఇమ్యూనిటీ పాస్‌ పోర్టులు ఇవ్వ‌డం ప్రారంభించాయి. దీనిపై స్పందించి డ‌బ్ల్యూహెచ్ ఓ వైరస్ నుంచి కోలుకున్న వారికి రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుందని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్‌ ఓ తెలిపింది. వారికి రోగ నిరోధ‌క శక్తి పెర‌గ‌ని స‌మ‌యంలో ఆ వైర‌స్ మ‌ళ్లీ వ్యాపించే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంది. అలాంటి వారికి కొన్నాళ్ల పాటు వేచి ఉండి పాస్‌ పోర్టులు - మిగ‌తా ప‌త్రాలు ఇవ్వాల‌ని సూచించింది.

Tags:    

Similar News