తెలంగాణ పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి జోరుమీదున్నాడు. అధికార టీఆర్ఎస్ ను ఓడించడమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలోనే తన భవిష్యత్ ప్రణాళికలను వివరించాడు. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా అనంతరం ఎన్నికల్లో గెలవలేదని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 1994 నుంచి పదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉంటే 2004 నుంచి పదేళ్ల పాటు టీడీపీ పాలించిందని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇక అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రెండు సార్లు గెలిచి పదేళ్లు పాలించిందన్నారు..
ఇప్పుడు టీఆర్ఎస్ కూడా రెండు సార్లు గెలిచిందని 2023 వరకు కేసీఆర్ పాలన ఉంటుందని రేవంత్ రెడ్డి వివరించారు. రాజకీయ పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చాలన్న ప్రజల నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందన్నారు. ఇది సీఎం కేసీఆర్ కు అర్థమైందన్నారు.కాంగ్రెస్ నే ప్రత్యామ్మాయం అని ప్రజలు భావిస్తున్నారన్నారు.
ప్రతిపక్షంలో బీజేపీనా, కాంగ్రెస్ అన్న చర్చ వచ్చినప్పుడు కేసీఆర్ కు ప్రత్యామ్మాయం కాంగ్రెస్ యేనని ప్రజలు భావిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా నిర్ణయం తీసుకున్నాక అందరూ గౌరవించాల్సిందేనని.. సీనియర్ల అసమ్మతి టీ కప్పులో తుఫాన్ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏదో జరుగుతుందని గోతికాడ గుంటనక్కల్లా ఎదురుచస్తున్న వారి ఆశలు నెరవేరవు.
పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకే నా బాధ్యత.. ఆ తర్వాత ఎవరు ఏ స్థానంలో ఉండాలన్నది పార్టీ, అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సీఎం ఎవరనేది సోనియానే నిర్ణయిస్తారని.. అప్పటివరకు పనిచేసుకుంటూ పోవడమే నా కర్తవ్యం అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
కోమటిరెడ్డి తనను వ్యతిరేకించినా కూడా ఆయనను కలుపుకొని పోతానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, మోహన్ రెడ్డిలతో మాట్లాడానని రేవంత్ రెడ్డి తెలిపారు. వారు సోనియా నిర్ణయాన్ని గౌరవిస్తామని అన్నారని.. వెంకటరెడ్డితోనూ మాట్లాడుతామని చెప్పారన్నారు.