జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సడెన్ సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. 2014లో తాను ప్రచారం చేసి పెట్టిన పార్టీలనే ఆయన ఏకేశారు. టీడీపీ ఎంపీలు - మంత్రులను తిట్టిపోశారు. హోదా ఎవరికోసం ఇస్తారంటూ ప్రశ్నించారు. తిరుపతి సభలో పవన్ చేసిన కామెంట్లు.. పొలిటికల్ గా పెద్ద దుమారం రేపాయి. అయితే, అసలు ఇంతకీ ఆయన అంత సెడన్ గా స్టేజ్ మీదకి ఎందుకు వచ్చారు? ఎవరు ఆయనకు డైరెక్షన్ చేశారు? ఎవరైనా చెబితేనే పవన్ పొలిటికల్ కామెంట్లు చేశారా? అసలింతకీ పవన్ స్టేజ్ మీటింగ్ బ్యాక్ గ్రౌండ్ లో ఎవరున్నారు? ఇప్పుడు ఇవన్నీ పొలిటికల్ గా వస్తున్న ప్రశ్నలు. దీనిని గమనిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
అటు బీజేపీ లేదా టీడీపీ ఈ రెండింటిలో ఏదో ఒకటి పవన్ వెనుక ఉందన్నది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని చంద్రబాబు ఆయన మంత్రులు - ఎంపీలు ఇరుకునపెట్టడంతో ఆయనను ఒంటరిని చేయాలని, 2019 ఎన్నికల్లో పవన్ తో చేరి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేసిందని, అందుకే పవన్ ఈ రకంగా రంగంలోకి దింపిందని కొందరు చెబుతున్నారు. అయితే, అదేసమయంలో జగన్ పార్టీ వైకాపాతోనూ పవన్ కలవకుండా బీజేపీ పక్కాగా ప్లాన్ వేసిందని, దానిప్రకారమే స్కెచ్ గీసిందని అంటున్నారు. మరోపక్క - పవన్ లేటెస్ట్ ఫైరింగ్ వెనుక చంద్రబాబే ఉన్నారని మరో టాక్ వస్తోంది.
కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమంతో ప్రభుత్వం ఓ మెట్టు దిగి వచ్చింది. ఆగస్టులోపు రిజర్వేషన్ లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పద్మనాభంకు అధికారపార్టీ నేతలు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11న కాపుల భవిష్యత్ కార్యాచరణ కోసం కాకినాడలో ముద్రగడ జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ మరుసటి రోజు నుంచే ఉద్యమంలోకి దిగాలని ఆయన అనుకుంటున్నారట! అందుకు విరుగుడుగా ప్రజల దృష్టిని మరల్చడం కోసం.. కాపుల రిజర్వేషన్ ను తాత్కాలికంగా అయినా వెనక్కు నెట్టడం కోసం చంద్రబాబే పవన్ ను తెరమీదకు తెచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు.
ఏదేమైనా.. పవన్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుని ప్రత్యేక హోదాపై ఇలా కామెంట్లు చేస్తుండడంపై ఆయన అభిమానులు - జనసేన కార్యకర్తలు మాత్రం హ్యాపీగా ఫీలైపోతున్నారు. కానీ, అసలు విషయం మాత్రం.. పవన్ వెనుక బీజేపీ ఉందా? చంద్రబాబు ఉన్నారా? అనేది మాత్రం ఆసక్తిగా నే ఉంది. ఎవరు ఉన్నా లేకున్నా.. పవన్ మాత్రం.. తన పోరు ఆగదనే సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. ఇక, ఈ క్రమంలోనే ఈ నెల 9న కాకినాడలో ఏర్పాటు చేసిన సభలో ఇంకెవరిని ఏకేస్తారో.. హోదాపై ఎలా పోరాడుతారో చూడాలి.