ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ కార్యక్రమం తీసుకున్నా లేక ఏ పధకం ప్రారంభించినా ఎమ్మెల్యేలు కానీ వారి అనుచరులు కానీ ఎందుకో సరైన తీరు లో ప్రచారం చేయడంలేదు అని అంటున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి ఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని ఏదో విధంగా జనం లోకి వెళ్ళేందుకు కార్యక్రమాలు తీసుకుని వస్తున్నారు. ఇప్పటిదాకా చూస్తే చాలా కార్యక్రమాలు అలాగే తీసుకుని వచ్చారు.
ఆ మధ్యన జగనన్నకు చెబుదాం అని ఒక కార్యక్రమం చేపట్టారు అయితే ఆ కార్యక్రమం నెగిటివ్ వేలో అయినా టీడీపీ నేతలు ప్రచారం కల్పించారు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇపుడు దానికి అనుసంధానం అన్నట్లుగా జగనన్న సురక్షా పధకం అన్న దానికి తీసుకుని వచ్చారు.
ఈ పధకం అయినా జనం లోకి వెళ్తే ప్రభుత్వానికి మంచి పేరు, ఎమ్మెల్యేల కు కూడా గ్రాఫ్ పెరుతుందని భావించారు. అయితే ఆర్భాటంగా సీఎం జగన్ ఈ పధకం ప్రారంభించారు కానీ ఎక్కడా పార్టీ ఎమ్మెల్యేల హడావుడి అయితే కనిపించడంలేదు అని అంటున్నారు.
అదే టైంలో చూస్తే ఈ పధకాన్ని నాలుగు వారాల పాటు నిర్వహించడానికి నిర్ణయించారు. అంటే ఈ పధకానికి అంతలా ప్రాచుర్యం కల్పించడం ద్వారా జనం లో నానేలా చేయాలని అలా పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రభుత్వం మీద వచ్చేలా చూడాలని భావించారు. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఎమ్మెల్యేలే ఈ పధకం పట్ల పెద్దగా ఆసక్తి చూపడంలేదు అని అంటున్నారు.
అదే విధంగా వారి అనుచరులు కూడా ఏ మాత్రం ఫోకస్ పెట్టడంలేదు అని అంటున్నారు. ఈ నేపధ్యం లోనే ఈ పధకం మీద మొదట వచ్చిన హైప్ అలా చప్పగా చల్లారిపోతోంది అని అంటున్నారు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేల ఇన్వాల్స్వెమెంట్ అయితే ఈ ప్రోగ్రాం లో పెద్దగా లేదని పీకే టీం ఒక నివేదిక ఇచ్చిందని టాక్ నడుస్తోంది.
పూర్తిగా అధికారుల తోనే ఈ పధకాన్ని లాంచ్ చేయడం వారే దీన్ని నిర్వహించడం వల్ల వైసీపీకి అనుకున్న పొలిటికల్ మైలేజ్ రావడంలేదు అని పీకే టీం చెబుతోందిట. అయితే ఎమ్మెల్యేలు ఎందుకు అంత ఉదాశీనంగా ఉన్నారు అన్న దాని మీదనే చర్చ సాగుతోంది. ఒక వైపు ఎన్నికలు దూసుకుని వస్తున్న వేళ స్పీడ్ పెంచాల్సిన ఎమ్మెల్యేలు సరైన సమయంలో ఎందుకు పట్టనట్లుగా ఉంటున్నారు అన్నదే చర్చగా ఉంది.
ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే చాలా కార్యక్రమాలు ఏపీ లో నాలుగేళ్ళుగా సాగాయని అందుకే వారు ఈసారి కూడా దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. అదే టైంలో ఎమ్మెల్యేల విషయమే తీసుకుంటే వారిలో ఎన్నికల బెంగ కూడా ఉందని అంటున్నారు ఇప్పటికి అనేకసార్లు జరిగిన వర్క్ షాప్ లో టికెట్లు ఇవ్వలేమని చెబుతున్నారని అంటున్నారు.
దాని వల్లనే ఇపుడు ఎమ్మెల్యేలు కూడా ముందు తన సంగతేంటో తేలితే కదా మిగిలిన విషయాలు అన్నట్లుగా లైట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు అయితే పార్టీ మీద ప్రభుత్వం మీద ఎమ్మెల్యేలు మొదటి నుంచి అంత సీరియస్ గా లేరని, వారిని ఆ పరిస్థితి కలిపించింది పీకే టీం సూచనలతో అధినాయకత్వమే అని అంటున్నారు.
మరో వైపు చూస్తే పీకే టీం ఇప్పటిదాకా అన్నీ ఎమ్మెల్యేల ను పక్కన పెట్టి నడిపించేలాగానే కార్యక్రమాలు డిజైన్ చేస్తూ వస్తుంది. ఇపుడు మాత్రం ఎమ్మెల్యేలు పాలుపంచుకోవడంలేదు అంటే వారు ఒక్కసారిగా అలెర్ట్ అయిపోరు కదా అన్న చర్చ సాగుతోంది. పీకే టీం వల్లనే ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు అన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి.
అదే టైంలో వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల కు మొదటి నుంచి ఉండాల్సిన బాండేజ్ సరిగ్గా లేదని, ఎక్కడో మిస్ అయిందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యేలు ఇపుడు మాత్రం జగనన్న సురక్షను లైట్ తీసుకుంటున్నారు అనే ప్రచారం సాగుతోంది. తమ టికెట్లకే రక్షణ లేదని కూడా వారి నుంచి సెటైర్లు పడుతున్నాయని అంటున్నారు.