ఏపీలో వైసీపీ పాదయాత్ర కార్యక్రమాలు ఎందుకు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి?

Update: 2020-11-09 15:30 GMT
ప్రజాదరణలో.. పలుకుబడిలో.. ప్రజల్లో నిరూపించుకోవడంలో జగన్ కు సాటిలేదని నిరూపితమైంది. ఏపీ ప్రజలు యావత్ ఆయన వెంట నడిచి 151 మంది ఎమ్మెల్యేలను కట్టబెట్టి ఏపీ చరిత్రలోనే గొప్ప విజయాన్ని అందించాడు. నాడు జగన్ మీటింగ్ లకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేవారు. జగన్ పిలుపునిస్తే బట్టలు చింపుకొని పోరాడేవారు. కానీ నేడు ఏమైంది.. వైసీపీ పాదయాత్ర పిలుపునకు స్పందన ఎందుకు కరువైంది. వైసీపీ కార్యక్రమాలను క్షేత్రస్థాయి నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదు. అసలు కారణమేంటన్న ప్రశ్న ఉదయిస్తోంది.

ఏపీలో వైఎస్ జగన్ సుధీర్ఘ పాదయాత్ర చేసిన ప్రతిఫలంగా వైసీపీకి ఏకపక్ష విజయం దక్కింది. క్రెడిట్ అంతా జగన్ కు, కార్యకర్తలకు రావాలి కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని టాక్ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వాళ్లు తమ బిజినెస్ లు దెబ్బతినకుండా ఉండేందుకు వైసీపీలో పెద్ద ఎత్తున చేరారు. ఇప్పుడు నియోజకవర్గాల్లో వారిదే పెత్తనం..ఇప్పటికీ నియోజకవర్గాల్లో వైసీపీలోకి వెళ్లే ప్రయత్నాలను టీడీపీ వాళ్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు.  లాబీయింగ్ లు చేసుకుంటున్నారన్న ప్రచారం ఉంది.

ఇదిలా ఉంటే జగన్ పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు అయ్యిందని.. ఈ సందర్భంలో జగన్ కు సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో పదిరోజులు ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్స్ పాదయాత్ర చేయమని వైసీపీ హైకమాండ్ ఆదేశిస్తే స్పందన కనీసం 10శాతం కూడా లేదని టాక్. నూటికి కేవలం 10శాతం మాత్రమే ఎమ్మెల్యేలు మొదలుపెట్టారని వినికిడి.  పాదయాత్ర మొదలుపెట్టిన వాళ్లు కూడా తూతూమంత్రంగా చేసి ఊరుకుంటున్నారు. ఎందుకంటే కార్యకర్తలకు న్యాయం చేయడం లేదు కాబట్టి.. ఒరిజినల్ వైసీపీ వాళ్లు ముఖం చాటేస్తున్నారని.. అద్దెకు తెచ్చుకున్న టీడీపీ నేతలు..‘ మనకెందుకు? మనం వచ్చింది..? కాంట్రాక్ట్ బిజినెస్ లు నడిపించడానికి’ అంటూ వాళ్లు రావడం లేదు.  వాళ్ల స్వార్థం చూసుకొని పట్టించుకోవడం లేదట.. ..

గ్రామాల్లో అయితే కనీసం ప్రచారం అర్భాటం  లేకుండా ఉందట.. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టుగా రియల్ వైసీపీ నాయకులు స్తబ్దుగా ఉండిపోతున్నారట... అదే ఎన్నికల ముందు అయితే వైఎస్ జగన్ పిలుపు ఇస్తే పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసేవారు.. కూడలిలో జనాలు నిరసనలు తెలిపారు. అప్పట్లో ఆ సందడే వేరు.  ఇప్పుడు చూస్తే అసలు ఎమ్మెల్యేలు వస్తే కూడా ‘ఆ..!  ఏం పోతాంలే అని అంటున్నారంటే’ నాయకుల్లో ఎంత అసమ్మతి ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
 
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున సంక్షేమ జల్లు కురిపించారు. దాదాపు 60వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టారు. కనీసం వైసీపీ నేతలను కూడా భాగస్వామ్యం చేయలేదన్న ఆవేదన వారిలో ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలు అంతా గ్రామ వలంటీర్లు చేస్తున్నారు. కాబట్టి తమకు లాభం లేదని వైసీపీ క్షేత్రస్థాయి నేతలు పాదయాత్రలను పట్టించుకోవడం లేదట.. ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు దీనిపై రిపోర్టు చేస్తున్నారట.. కానీ హైకమాండ్ దీనిమీద రివ్యూలు చేయడం లేదట.. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా నాయకులను పట్టించుకోవడం లేదట.. అందుకే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవుతున్నాయని వైసీపీ నిజమైన నాయకులు చెబుతున్నారు.  

ఇలా ఎమ్మెల్యేల అలసత్వం కారణంగా క్షేత్రస్థాయిలో నిజమైన వైసీపీ నేతలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారిలో ఉంది. ప్రభుత్వంలో తాము భాగస్వాములు కాము అని వారంతా భావిస్తున్నారు. అటు ప్రభుత్వం ఇన్ వాల్వ్ చేయక.. ఇటు ఎమ్మెల్యేలు దగ్గరికి తీసుకోకపోవడంతో నేతలంతా గమ్మున ఊరుకుంటున్నారు. దీంతోనే వైసీపీ కార్యక్రమాలకు స్పందన కరువరుతోందట..
Tags:    

Similar News