ప్రేమజీవుల స్వర్గం తాజ్ మహల్ ను అమెరికా ప్రథమ మహిళ మెలానియాతో కలిసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. తాజ్ అందాలకు ట్రంప్, మెలానియా మైమరిచిపోయారు. చెట్టాపట్టాలేసుకుని ఆ ప్రాంగణంలో కలియదిరిగారు. తాజ్ వద్ద గంటకుపైగా గడిపారు. మూడంచెల భద్రతా వలయంలో ట్రంప్ దంపతులు తాజ్ మహల్ ప్రాంగణంలో తిరుగుతూ తాజ్ అందాలని ఆస్వాదించారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరు తాజ్ మహల్ వద్ద గడిపారు.
ట్రంప్ దంపతులకి టూర్ గైడ్ నితిన్ సింగ్ అన్ని వివరాలను తెలిపారు.. తాజ్‌మహల్ గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు.. అయితే, తాజ్ మహల్ లోని సమాధుల వద్దకు వెళ్లలేకపోయారు ట్రంప్.. అక్కడకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్నారు.. అయితే, సమాధుల దగ్గరకు వెళ్లే మార్గం ఎత్తు తక్కువగా ఉండడం, ఇరుకుగానూ కూడా ఉండడంతో ఆయన భద్రతా సిబ్బంది ముందే హెచ్చరించారట.
దీంతో ఆయన తాజ్‌మహల్‌లోని షాజహాన్-ముంతాజ్‌ల సమాధుల వద్దకు వెళ్లకుండానే వెనుదిరిగారు. గైడ్ నితిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ట్రంప్ దంపతులకు గైడ్‌గా వ్యవహరించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు నితిన్. మరోసారి తాజ్‌మహల్‌ను సందర్శిస్తామని ట్రంప్ దంపతులు చెప్పారన్న నితిన్.. ట్రంప్ కుటుంబానికి తాజ్ గురించి వివరించే అదృష్టం దక్కడం.. తన జీవితంలో మరిచిపోలేని రోజుగా అభివర్ణించాడు.