ఈ రోజు ఉదయం ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఆయన.. ముఖ్యమంత్రి హోదాలో తనకు కేంద్ర విదేశాంగ శాఖ జారీ చేసిన డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ ను అక్కడి అధికారులకు అప్పగించారు. అయితే.. తన పాస్ పోర్ట్ ను జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి కేవలం రెండు గంటల ముందు పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. తనకిచ్చిన డిప్లమాటిక్ పాస్ పోర్ట్ ను అధికారులకు ఇచ్చేసిన ఆయన.. సాధారణ పాస్ పోర్టును తీసుకున్నారు. బాబుతో పాటు.. ఆయన వ్యక్తిగత సిబ్బంది.. భద్రతా సిబ్బంది మాత్రమే వచ్చారు.
పాస్ పోర్ట్ కార్యాలయంలో దాదాపు 20 నిమిషాలకు పైనే చంద్రబాబు ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే బాబు పనిని అధికారులు పూర్తి చేశారు. వాస్తవానికిబాబు పని కేవలం ఎనిమిది.. పది నిమిషాల్లో ముగిసినప్పటికీ.. కార్యాలయానికి వచ్చిన సాధారణ ప్రజలు చంద్రబాబు ను చూసి.. ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. దీంతో.. వారి మాట కాదనలేని చంద్రబాబు.. వారితో ఫోటోలు దిగారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బాబుతో ఫోటోలు దిగిన వారిలో పాస్ పోర్ట్ కార్యాలయ సిబ్బంది కూడా ఉన్నారు.