ఆశ్చర్యం.. అనూహ్యం.. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న పార్టీని ప్రక్షాళన చేసి పార్లమెంట్ నియోజకవర్గాలకు కొత్త అధ్యక్షులను, పదాధికారులను భారీగానే ప్రకటించారు. అంతమందిని నియమించిన చంద్రబాబు.. తన అనుంగ శిష్యుడు అచ్చెన్నాయుడికి మాత్రం హ్యాండ్ ఇవ్వడం ఏంటి చెప్మా ఇప్పుడు టీడీపీ అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టై బెయిల్ మీద బయటికొచ్చిన అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి ఇవ్వాలనుకున్నా చంద్రబాబు ఎందుకు వెనక్కి తగ్గాడన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అచ్చెన్నాయుడు వద్దన్నాడా..? లేక తనయుడు లోకేష్ అడ్డుపడ్డడా..? అన్నది తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టై, జైలుకు వెళ్లి వచ్చిన అచ్చెన్నాయుడిపై చంద్రబాబుకు సానుభూతి బాగా పెరిగింది. అందుకే ఆయననే టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నియమించాలని అనుకున్నాడట.. ఈ మేరకు తన అనుకూల మీడియా ద్వారా బాగానే ప్రచారం చేయించారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ.. అధ్యక్షుడి పేరును మాత్రం వెల్లడించకపోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.. ఏడాదిగా ఆ పదవిపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నా ఇంతవరకు నియామకం లేకుండా పోయింది.
ప్రస్తుతం ఏపీలో అంతా బాబు, చినబాబు కనుసన్నల్లోనే నడుస్తోందట. 13 జిల్లాల పార్టీకి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉండగా.. తనయుడు లోకేష్ కూడా ముఖ్య నేతగా ఉన్నాడు. వీరిద్దరూ పోను మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంకొకరు అవసరమా అనే అభిప్రాయాలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయట. అధ్యక్ష పదవి ఇచ్చినా ఎలాగూ డమ్మీనే. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్‌ను కాదని నిర్ణయాలు చేసే ఆస్కారం ఉండదు. మరి మాటిమాటికి లీకులు ఇస్తూ చంద్రబాబు ఇలా అందరినీ ఎందుకు కన్‌ఫ్యూజ్ చేస్తున్నట్లు..? అని కొందరు నేతలు సెటైర్లు వేస్తున్నారట..
ఇవ్వాలనుకుంటే అచ్చెన్నాయుడికి పదవి ఇచ్చేయాలి. ఈ దోబూచులాట ఏంటని పలువురు కౌంటర్ ఇస్తున్నారు. అయితే.. ఈ పదవి చేపట్టడానికి అచ్చెన్నాయుడు ఆసక్తిగా లేడని తెలుస్తోంది. ఈఎస్ఐ స్కాంలో తనను బలి చేశారనే ఫీలింగ్ అచ్చెన్నాయుడిలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకే జైలుకెళ్లొచ్చాక సైలెంట్ అయ్యాడు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. ఆ పదవి తీసుకున్నా పెద్దగా ఏమీ ఉండదు అనే భావనలో ఉన్నాడట. అందుకే.. తనకు ఆ పదవి వద్దన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇక మరో వాదన కూడా వినిపిస్తోంది. నారా లోకేష్ కూడా అచ్చెన్నాయుడు నియామకాన్ని అడుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో బాబు గారు ఆ పదవిని అచ్చెన్నాయుడికి ఇస్తారా..? లేదా మరో క్యాండిడేట్ కోసం వెతుకుతారా అన్నది తేలాల్సి ఉంది.