తిరుపతికి వెళ్లే జగన్ మధ్యలో హైదరాబాద్ కు ఎందుకు వచ్చినట్లు?

Update: 2022-09-28 05:07 GMT
మంగళవారం గన్నవరం నుంచి తిరుపతికి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. గన్నవరంలో ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన నేరుగా తిరుపతికి వెళ్లాల్సి ఉంది. కానీ..

విచిత్రంగా ఆయన తిరుపతికి వెళ్లకుండా హైదరాబాద్ కు వచ్చారు. అలా అని.. హైదరాబాద్ లోని తన నివాసమైన లోటస్ పాండ్ కు వెళ్లారా? అంటే వెళ్లలేదు. బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ఆయన విమానం..

అక్కడే కాసేపు ఉండి.. ఆ తర్వాత తిరుపతికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఎందుకిలా? అన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సమయంలో సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆమె హైదరాబాద్ కు రావాల్సి ఉందని.. అందుకే గన్నవరం నుంచి బయలుదేరిన విమానం హైదరాబాద్ బేగం పేటకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

బేగంపేటకు చేరుకున్న విమానం ఆమె దిగి వెళ్లిన తర్వాత.. కాసేపు బేగంపేట విమానాశ్రయంలోనే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఆ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జగన్ ఫ్లైట్ తో పాటు మరో ప్రత్యేక విమానం కూడా బయలుదేరి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వీవీఐపీ పారిశ్రామికవేత్త కుటుంబం ఉందన్న మాట చెబుతున్నారు. ఈ రెండు ప్రత్యేక విమానాలు కాస్త తేడాతో తిరుపతికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా.. తిరుపతికి వెళ్లాల్సిన ముఖ్యమంత్రి జగన్.

గన్నవరం నుంచి నేరుగా వెళ్లకుండా హైదరాబాద్ కు వచ్చి వెళ్లటం.. చుట్టు తిరుగుడు ప్రయాణమన్న మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి ఈ మాత్రం తెలీదా? అంటే చెప్పలేం కానీ.. ఇలాంటివి సొంత ఖర్చులతో చేస్తే బాగుంటుందని మాత్రం చెప్పక తప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News