బీజేపీ అనుకూల చానెల్ ఏపీ సీఎంను ఎందుకు టార్గెట్ చేస్తోంది?

Update: 2021-03-09 14:38 GMT
బీజేపీ అనుకూల చానెల్ ఏదీ అని ఢిల్లీలో ఎవరిని అడిగినా ఠక్కున 'రిపబ్లిక్ టీవీ' పేరే చెబుతారు.. ఎందుకంటే బీజేపీ పెద్దలే ఈ చానెల్ ను పెట్టించారని.. అర్నాబ్ గోస్వామిని ఎడిటర్ గా పెట్టి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారని జర్నలిస్టు సర్కిల్స్ లో ఓ టాక్ ఉంది. దేశంలో ఎవ్వరినీ అడిగినా ఇదే చెప్తూ ఉంటారు.

అర్నాబ్ గోస్వామి ఈ మధ్య బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో బీజేపీకి అనుకూలంగా.. మహారాష్ట్ర సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తన రిపబ్లిక్ టీవీలో ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు ప్రసారం చేసి శివసేన సర్కార్ ను ఫుట్ బాల్ ఆడేశారు.. దీనిపై ఆగ్రహించిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పాత కేసులు తవ్వి తీసి మరీ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ ను జైలుకు పంపి తన ప్రతీకారం తీర్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే

అయితే గత నాలుగు రోజుల నుంచి రెండు సార్లు ఏపీ సీఎం జగన్ ను రిపబ్లిక్ టీవీలో టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. మ్యాటర్ లేని విషయాన్ని పదేపదే వల్లెవేస్తూ అభాసుపాలు చేసేలా ప్రసారం చేశాడని సమాచారం. ఏపీ సీఎంకు సంబంధించిన కొందరు ఎన్ఆర్ఐల హవాలా డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయని.. అది కూడా పేరు కానీ.. ఎవరికనేది ఎక్కడ చెప్పకుండా ఏదో పెయిడ్ ఆర్టికల్ మాదిరి వేశారని చూసిన వాళ్లు చెబుతున్నారు. కానీ ఆ చానెల్ లో ఆ ఆర్టికల్ లో ఒక్క పేరు చెప్పకుండా.. ఏదో వేరే దేశంలో వాళ్లు ఫిర్యాదు చేశారని ప్రసారం చేశారు.

మళ్లీ నిన్న ఏపీలోని ప్రభుత్వాన్ని ఒక పెద్ద పార్టీ చీలుస్తోందని.. ఓ కీలక నేత వెంట కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏదో తెలిసి తెలియకుండా వేసే ఆర్టికల్ ను జగన్ పార్టీ కుప్పకూలుతుందని కథనం ప్రసారం చేశారు. 151 సీట్లు ఉన్న పార్టీని ఎవరైనా చీల్చాలనే ధైర్యం చేస్తారా? అంత ఫుల్ మెజార్టీ ఉన్న జగన్ కు కొంతమంది ఎమ్మెల్యేలు పోయినా ఫర్వాలేదు.అయినా అధికార పార్టీ నుంచి ఎవరైనా పోతారా? అన్న సందేహాలు ఉన్నాయి. కానీ రిపబ్లిక్ టీవీ మాత్రం జగన్ పార్టీ టార్గెట్ గానే ఈ కథనం ప్రసారం చేసిందని తెలుస్తోంది.

ఈ పెయిడ్ ఆర్టికల్ వెనుకాల ఎవరున్నారు.. రిపబ్లిక్ టీవీలో ఈ కథనాలు ఎవరు వేయిస్తున్నారు? అన్న దానిపై వైసీపీ హైకమాండ్ విచారణ చేస్తోందని టాక్.  మరి త్వరలోనే రిపబ్లిక్ టీవీకి న్యాయపరంగా షాకులు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం రెడీ అయినట్లు సమాచారం.
Tags:    

Similar News