ఆ సీటుకు ఎంపీ అభ్య‌ర్థిని వెతుకుతున్న వైసీపీ రీజ‌నేంటి

Update: 2022-07-20 03:30 GMT
ఔను.. రాజ‌కీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండ‌వు. అవ‌కాశం.. అవ‌స‌రం.. అనే రెండు ప‌ట్టాల‌పైనే సాగుతుం టాయి. ఎక్క‌డ ఎప్పుడు ఎలాంటి తేడా వ‌చ్చినా.. పార్టీలు. అభ్య‌ర్థులు ఎవ‌రి దారి వారి చూసుకుంటారు. ఇప్పుడు.. వైసీపీలోనూ..ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ అభ్య‌ర్థి కోసం.. అప్పుడే పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎవ‌రైనా ఫ‌ర్వాలేదు. కానీ, విధేయుడై ఉండాలి. మ‌రీ ముఖ్యంగా పార్టీలో ఉంటూ.. పొరుగు పార్టీతో చెట్టాప‌ట్టాలు వేయ‌కుండా ఉండాలి.

ఇక‌, అంతో ఇంతో ఖ‌ర్చు పెట్టేవాడై ఉండాలి.. అనే ష‌ర‌తుల‌తో ఎంపీ అభ్య‌ర్థి కోసం.. నాయ‌కుల‌కు క్లూ ఇచ్చి నట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ నియోజ‌క‌వ‌ర్గ‌మే ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలు.

ఇక్క‌డ నుంచి 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని దాదాపు త‌ప్పించేస్తున్నార ని.. కొన్నాళ్లుగా ప్ర‌చారం ఉంది. ఆయ‌న టీడీపీ ఎంపీల‌కు పార్టీలు ఇవ్వ‌డం.. పార్టీ నేత‌ల‌తో క‌లివిడిగా ఉండ‌డం అధిష్టానానికి న‌చ్చ‌డం లేదు.

దీంతోపాటు.. ఇదే జిల్లాలో జ‌రిగిన మ‌హానాడుకు.. ప‌రోక్షంగా సాయం చేశార‌ని.. అధిష్టానానికి ఫిర్యాదులు అందిన‌ట్టు వైసీపీలో నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు.

దీనిపై ఎంపీని పిలిచి ప్ర‌శ్నించాల‌ని అనుకున్నా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. ఆయ‌న‌మ‌నసు అక్క‌డే ఉంద‌ని.. కాబ‌ట్టి..ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డ‌మే మేల‌ని.. పార్టీ దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అయితే.. ఈ ప‌రిణామం.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఇబ్బంది రాకుండా.. చూడాల‌నేది వ్యూహం.

రెడ్డి నేత‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నార‌నే వాద‌న తెర‌మీద‌కి వ‌స్తే.. ఇప్ప‌టికే ఆగ్ర‌హంతో ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గం వ్యాపారులు.. నాయ‌కులుమ‌రింత ర‌గిలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అందుకే.. చాప‌కింద నీరులా.. మ‌రింత‌గా మాంగుట‌కు అవ‌కాశం ఇచ్చి.. ఆయ‌న టీడీపీకి చేరువ అయ్యేలా చేసి.. అప్పుడు ఆయ‌న‌ను త‌ప్పించేసి.. వేరే వ్య‌క్తికి ఛాన్స్ ఇచ్చేయాల‌ని చూస్తున్న‌ట్టు ప్ర‌కాశం జిల్లా వ‌ర్గాలు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News