ఢిల్లీలో జ‌న‌సేన పొత్తులు ఎందుకు తేల్చలేదు ?

Update: 2023-04-07 19:00 GMT
ఎన్నో ఆశ‌ల‌తో ఢిల్లీకి వెళ్లిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పెద్ద మైన‌స్ అయింది. పొత్తుల విష‌యంలో ఆయ‌న‌కు ఎలాంటి సందేశం రాలేదు. వాస్త‌వానికి ఇప్ప‌టికిప్పుడు పొత్తుల విష‌యంపై తేల్చేసుకుని.. క‌లిసి ఉమ్మ‌డిగా.. ముందుకు సాగాల‌ని ప‌వ‌న్‌-చంద్ర‌బాబు భావించార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్  హ‌డావుడిగా  హ‌స్తిన బాట ప‌ట్టారు. నిజానికి ఇప్పుడున్న స‌మ‌యంలో బీజేపీ పెద్ద‌లకు తీరిక లేదు.

ఒక‌వైపు క‌ర్ణాట‌క ఎన్నిక‌లు.. మ‌రోవైపు పార్ల‌మెంటు.. నేప‌థ్యంలో ఏమాత్రం తీరిక లేకుండా గ‌డుపుతున్నా రు.. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా ప‌వ‌న్‌.. హ‌స్తిన బాట ప‌ట్ట‌డం.. అక్క‌డ చ‌క్రం తిప్పాల‌ని భావించ డం వంటివి.. స‌మ‌యానికి త‌గు విధంగా లేవ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు ప‌రిశీల‌కులు. దీనికి తోడు... ఇప్ప‌డు క‌ర్ణాట‌క‌లో బీజేపీకి విజ‌యం సాధించ‌డం క‌ష్ట‌మ‌నే సంకేతాలు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకుని.. ముందుకు సాగాల‌నే ల‌క్ష్యంతో బీజేపీ పెద్ద‌లు ఉన్నారు. అంటే.. ఏపీలో ఉన్న అధికార పార్టీ వైసీపీ అధినేత స‌హ‌కారం.. ఇప్పుడు బీజేపీకి అత్య‌వ‌స‌రంగా మారింది.

ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా వైసీపీకి చెక్ పెడుతూ.. పొత్తుల‌కు చేతులు క‌ల‌ప‌డం.. అనేది ఏ రకంగానూ రాజ‌కీయ వ్యూహం కానేర‌దు. ఈ విష‌యం గ్ర‌హించ‌కుండానే ప‌వ‌న్ ఢిల్లీ బాట ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

పైగా.. టీడీపీని చేర‌దీయ‌డం వ‌ల్ల‌.. ఇప్ప‌టికిప్పుడు బీజేపీకి వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఎంత‌? అనే అంచ‌నాలు కూడా బీజేపీ పెద్ద‌ల ద‌గ్గ‌ర ఉన్నాయి. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న నాయ‌కులు అధికారంలో ఉన్నారు క‌నుక‌.. త‌మ‌కు అన్ని విధాలా సాయం చేసే అవ‌కాశం ఉంది.

సో.. అటు నుంచి స‌హ‌కారం కూడా ఉంది. ఇలాంటి త‌రుణంలో వైసీపీ వంటిబ‌ల‌మైన అధికార పార్టీని ప‌క్క‌న పెట్టి.. బీజేపీ నేత‌లు ఇప్ప‌టికిప్పుడు పొత్తుల కోసం వెంప‌ర్లాడ‌తార‌నేది సాధ్యం కాద‌ని అంటున్నారు ఢిల్లీ ప‌రిశీల‌కులు. అందుకే.. పొత్తులు తేల్చ‌లేద‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News