కేటీఆర్ మాట.. జూడాల ఇగోను అంతలా హర్ట్ చేసిందా?
టీకప్పులో తుపానులా తేలిపోతుందనుకున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన పీటముడి పడటమే కాదు.. డీఎంఈతో జరిపిన చర్చలు విఫలమైనట్లుగా ప్రకటించటం తెలిసిందే. దీనంతటికి కారణం ఏమిటి? జూనియర్ డాక్టర్ల డిమాండ్లు ఏమిటి? వాటిల్లో న్యాయం ఎంత? అసలీ ఇష్యూను సీఎం కేసీఆర్ డీల్ చేస్తున్న వేళ.. మంత్రి కేటీఆర్ మాట తెర మీదకు ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి.
సుదీర్ఘకాలంగా జూనియర్ డాక్టర్లు కొన్ని డిమాండ్లను ప్రముఖంగా వినిపిస్తున్నారు. కొవిడ్ వేళ.. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి వైద్యం చేస్తున్న వేళ.. తమకు కొన్ని వసతులు.. హామీలు అర్జెంట్ గా ఇవ్వాలని కోరుతున్నారు. అందులో మొదటిది.. ఇప్పుడిస్తున్న జీతానికి 15 శాతం వేతనం పెంపు.. కొవిడ్ సేవలకు మరో 15 శాతం ఇన్సెంటివ్ అమలు చేయాలన్నది ప్రధాన డిమాండ్. దీంతో పాటు.. కొవిడ్ విధుల్లో ఉండి మరణించిన జూడాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని.. ఒకవేళ ఎవరైనా కొవిడ్ బారిన పడితే.. వారికి నిమ్స్ లో వైద్యం ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది.
సాపేక్షంగా చూస్తే.. కరోనా లాంటి మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు.. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న వైద్యులకు ఏం ఇచ్చినా తక్కువే అవుతుంది. ఆ కోణంలో చూసినప్పుడు వారి డిమాండ్లు న్యాయమైనవనే చెప్పాలి. అన్నింటికి మించి వైద్యం చేసే వేళలో కొవిడ్ బారిన పడితే.. నిమ్స్ లో ప్రత్యేకంగా వైద్యం చేయించాలని కోరటం తప్పేం కాదు కదా? ఏ రాజకీయ నాయకుడు.. ఆ మాటకు వస్తే ప్రజాప్రతినిధి.. తమకు కరోనా సోకితే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళుతున్నారే కానీ.. నిమ్స్.. గాంధీకి వెళ్లరు కదా. నిమ్స్ అయినా వెళతారేమో కానీ.. గాంధీకి చచ్చినా వెళ్లరు.
అలాంటప్పుడు జూడాల డిమాండ్ లో అర్థముంది. అయితే.. వీరి డిమాండ్ల విషయంలో సీఎం కేసీఆర్ కొంత సానుకూలంగా మాట్లాడితే.. మంత్రి కేటీఆర్ మాట్లాడినట్లుగా చెబుతున్న మాటలు.. జూడాల ఇగోను దారుణంగా డ్యామేజ్ చేశాయని చెబుతున్నారు. జూనియర్ డాక్టర్లు సమ్మె చేయటానికి ఇది సరైన సమయం కాదని.. సమ్మెను విరమించుకోకుంటే తదుపరి చర్యలు ఉంటాయని ఆయన వార్నింగ్ ఇచ్చినట్లుగా వచ్చిన వార్తలు ఇష్యూను పీటముడి పడేలా చేశాయన్న మాట వినిపిస్తోంది. కేటీఆర్ మాటలు (ఎక్కడ అన్నారో స్పష్టంగా చెప్పటం లేదు కానీ.. జూడాలు మాత్రం తమ మాటల్లో ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు) వారిని భారీగా హర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇదంతా చూస్తే.. పెరగిన గ్యాప్ ను గుర్తించి మంత్రి కేటీఆర్ వెంటనే రంగంలోకి దిగి.. జూడాలకు సర్ది చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ప్రాణాల్ని పణంగా పెట్టి పని చేస్తున్న వైద్యులు.. ఆరోగ్య సిబ్బందికి ఎంత చేసినా.. మరెంత ఇచ్చినా తక్కువే అవుతుంది. వారికి టాప్ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరోనా కాలంలో ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయాన్ని కేసీఆర్.. కేటీఆర్ లాంటి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇరువురు కూడా పాజిటివ్ అయి.. వైద్య చికిత్స తీసుకున్న తర్వాత నార్మల్ కావటాన్ని మర్చిపోకూడదు. జూడాల డిమాండ్లపై కేసీఆర్ సర్కారు ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.