రాష్ట్రపతి సెక్యూరిటీ ఎంపిక విషయం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. హర్యానాకు చెందిన గౌరవ్ యాదవ్ అనే వ్యక్తి రాష్ట్రపతి భద్రతా సిబ్బందిగా మూడు కులాలకు చెందిన వారు మాత్రమే ఎందుకు ఉంటారో కారణం తెలుపాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆశ్చరమైన న్యాయస్థానం ఆ మూడు కులాల వారే రాష్ట్రపతి భద్రతా సిబ్బంది ఎంపిక విషయంలో ఏం జరుగుతుందని అటు కేంద్రానికి, ఇటు భారత ఆర్మీ చీఫ్ కు నోటీసులు పంపింది.
గతేడాది సెప్టెంబర్ లో రాష్ట్రపతి సిబ్బంది కోసం జరిగి ఎంపికలో అభ్యర్థులంతా జాట్లు- రాజ్ పుత్- సిక్కు కులాలకు చెందిన వారికి మాత్రమే పిలుపు వచ్చిందని పిటిషన్ పేర్కొన్నాడు. రాష్ట్రపతి బాడీగార్డ్ ఎంపిక పోస్టు కోసం విడుదల నోటీఫికేషన్ ప్రకారం తనకు అన్ని అర్హతలు ఉన్నాయని తనకు ఒక కులం మాత్రమే వేరు అని కోర్టుకు తెలిపాడు. అంతేకాకుండా తాను యాదవ సామాజిక వర్గానికి చెందినవంటూ పిటిషన్ లో పేర్కొన్నాడు.
ఇదే విషయంలో 2013లోనూ చర్చ జరిగింది. రాష్ట్రపతి సెక్యూరిటీ గార్డ్స్ గా హిందూ జాట్లు- హిందూ రాజ్ ఫుత్లు- జాట్ సిక్కుల సామాజిక వర్గానికి చెందిన వారి కోసమే గతంలో నియామకాలు చేపట్టినట్లు ఆర్మీ సుప్రీం కోర్టుకు తెలిపింది. అయితే దీని వెనుక తమకు కులం పట్ల వివక్షలేదని పేర్కొంది.
రాష్ట్రపతి భవన్ లో జరిగే పలు కార్యక్రమాలకు హైట్- చూసేందుకు మంచి లుక్ ఉన్న వారినే ఎంపిక చేయడం జరుగుతుందని ఆర్మీ వెల్లడించింది. ఇందులో సామాజిక వర్గానికి అన్యాయం చేసేందుకు కాదని ఆర్మీ తెలిపింది. గతంలో ఈ మూడుకులాల వారినే ఎంపిక చేయడంపై హర్యానాకు చెందిన డాక్టర్ ఐఎస్ యాదవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రాంతం, మతం ప్రాతిపదికన రిక్రూట్ మెంట్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. మరీ ఇప్పడు కూడా ఆర్మీ కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరీ.