ఏపీ ప్రజలు అఖండమెజార్టీ ఇచ్చారు. బీసీలు- ఎస్సీలు- ఎస్టీలు జగన్ కే జై కొట్టారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని జగన్ అందిపుచ్చుకొని ఆయా వర్గాలకే పెద్దపీట వేశారు. సీనియర్లను పక్కనపెట్టి కుల, సామాజికసమీకరణాల నేపథ్యంలో కొత్తవారికే మంత్రి పదవులు ఇచ్చారు. రోజా- ధర్మాన ప్రసాద్ రావు- ఆనం- చెవిరెడ్డి లాంటి వాళ్లు పోటీపడినా.. జగన్ ఆయా వర్గాలకు న్యాయం చేయాలని ఈ సాహసం చేశారు.
అయితే కొత్త వారు అయినా బాగా పనిచేస్తారు అనుకుంటే ఇప్పుడు అలిగేషన్- బంధుప్రీతి- కుటుంబ సభ్యుల జోక్యంతో కీలక శాఖల్లో అవినీతి- ఆమ్యామ్యాలు పెరిగిపోతున్నాయని జగన్ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. దీనిపై సీఎంవో ఆరాతీసి జగన్ కు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులపై వేటు వేయడం ఖాయమన్న ప్రచారం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.
ఇప్పటికే ఇద్దరు మంత్రులకు హెచ్చరికలకు పంపిన జగన్ తీరుమార్చుకోకపోతే తొలగిస్తానని కూడా స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వారిని పిలిపించిన జగన్ ఈ మేరకు వారిద్దరికీ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
కోస్తా ప్రాంతంలోని ఆ కీలక జిల్లాలో మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులయ్యారు. సీనియర్లను కాదని జూనియర్లకు కీలక శాఖలు ఇస్తే వారి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారట.. ఇక మరో మంత్రి కూడా దూకుడుగా వ్యవహరిస్తూ చిక్కులు తెచ్చిపెడుతున్నారట.. ఆయన వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున కంప్లైట్లు వచ్చినట్టుసమాచారం. వీరిద్దరూ జగన్ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించారట.. అధికారులతో సమన్వయం లోపం.. ఆ మంత్రి కుటుంబ సభ్యుల జోక్యం బాగా పెరిగిపోయిందని సమాచారం. దీంతో జగన్ పిలుపించుకొని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఆయా జిల్లాలో యాక్టివ్ అయ్యారు. అయితే తెరవెనుక వ్యవహారాలు మాత్రం ఇంకా అలానే కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే ప్రభుత్వానికి నష్టం చేకూరే ఇలాంటి విషయంలో ఉపేక్షించవద్దన్న అభిప్రాయం వైసీపీ అధిష్టానంలో మొదలైనట్టు తెలుస్తోంది. అందుకే తెలంగాణ తొలి ప్రభుత్వంలో కేసీఆర్ అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్యపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీరియస్ అయ్యి తొలగించినట్టుగానే జగన్ కూడా ఆ ఇద్దరు మంత్రులను తొలగించి మిగతా వారికి హెచ్చరికలు పంపేందుకు సిద్ధమయ్యారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన ప్రభుత్వంలో అవినీతి, అశ్రిత పక్షపాతం సహించదని.. మంత్రులకు, అధికారులకు హెచ్చరించడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ ప్రభుత్వంలో సాగుతోంది.