సాధారణంగా కొంతమంది పౌరులు రకరకాల కారణాల వల్ల తమ ఓటు హక్కును వినియోగించుకోరు. కొంతమందికి రాజకీయాలపై ఆసక్తి లేకపోవడం ఒక కారణమైతే.....నాయకులపై నమ్మకం లేకపోవడం మరోకారణం. అయితే, స్వయంగా ఓ పార్టీలో కీలకమైన నేతగా ఉన్న ఓ వ్యక్తి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం మాత్రం గమనార్హం. ఈ ఏడాది జరిగిన కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ రమ్య తన ఓటు హక్కు వినియోగించుకోకపోవం పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, తాజాగా కర్ణాటకలో నేడు జరుగుతోన్న మునిసిపల్ కార్పొరేషన్ - పుర సభ ఎన్నికల ఓటింగ్ కు కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు రమ్య హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
రానున్న లోక్ సభ ఎన్నికలకు శుక్రవారం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు రిహార్సల్ అని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో నేడు రమ్య తన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి వస్తుందా రాదా అన్నది చర్చనీయాంశమైంది. మండ్యలోని నగర సభ వార్డు నెంబర్ 11లో మాజీ ఎంపీ రమ్యకు ఓటు ఉంది. మండ్యలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె....ఆ తరువాత స్థానిక ప్రజలకు దూరంగా ఉంటున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఓటు హక్కును రమ్య వినియోగించుకోకుండా ఢిల్లీలోని ఉండిపోయారు. తాజాగా, శుక్రవారం సాయంత్రం లోపు రమ్య ఓటు హక్కు వినియోగించుకుంటారా? లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ క్రమంలోనే రమ్య...వస్తారా ...రారా అని స్థానిక మీడియా సభ్యులు రమ్య ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పోలింగ్ కేంద్రం దగ్గర కాచుకు కూర్చున్నారు.