ఓపక్క లాక్ డౌన్ సడలింపులు చేస్తూనే.. మరోవైపు లాక్ డౌన్ కొనసాగింపుపై సమాలోచనలు సాగుతున్న సిత్రమైన పరిస్థితి దేశంలో నెలకొంది. ఇప్పటివరకు సాగిన లాక్ డౌన్ ను మరో రెండువారాల పాటు కొనసాగించే వీలుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా ఫోన్ చేసి వారి అభిప్రాయాల్ని సేకరించిన విషయం తెలిసిందే. ఇవాళో.. రేపో కేంద్రం లాక్ డౌన్ పొడిగింపుపై తన నిర్ణయాన్ని ప్రకటించనుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈసారి లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించే వేళలోనే.. మరిన్ని సడలింపుల గురించి ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా మాల్స్ ను తెరిచే అంశాన్ని తప్పనిసరిగా చెబుతారంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అన్ని వ్యాపారాలు (మాల్స్.. రెస్టారెంట్లు.. థియేటర్లు.. లాడ్జిలు.. పబ్బులు లాంటివి మినహా) తెరుచుకోవచ్చని పేర్కొన్నారు. మాల్స్ ను తెరవటంపై కేంద్రానికి ఉన్న అభ్యంతరాలపై వాణిజ్య వర్గాలు విభేదిస్తున్నాయి.
తాజాగా కేంద్ర వాణిజ్య.. పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్ కు .. వర్తక సంఘాల ప్రతినిధుల మధ్య సాగిన సమావేశంలో.. మాల్స్ ను తెరిచేలా అనుమతులు ఇవ్వాలన్న సూచన చేసినట్లుగా చెబుతున్నారు. లాక్ డౌన్ మార్గదర్శకాల్లో సడలింపులు ఇచ్చినా కొన్ని ఇబ్బందులు తప్పట్లేదన్న మాటను కేంద్రం వరకూ తీసుకెళ్లిన ట్రేడర్లు..నిత్యవసరం అన్న పదంతో సంబంధం లేకుండా షాపులు ఓపెన్ చేసుకునేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. తాజా సూచన నేపథ్యంలో రానున్న కొద్ది రోజుల్లోనే మాల్స్ తిరిగి ప్రారంభమవుతాయని చెబుతున్నారు. మరి.. ఈసారి తెరిచే మాల్స్ లో ఎలాంటి నిబంధనల్ని అమలు చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మాల్ విస్తీర్ణం ఆధారంగా ఎంతమంది విజిటర్లను అనుమతించాలన్న విషయంపై కసరత్తు చేస్తారని చెబుతున్నారు. అంతేకాదు.. మాల్స్ లో పారిశుద్ధ నిర్వహణ అన్నది కీలకంగా మారనుందని చెబుతున్నారు. రద్దీగా ఉండే షాపుల్లో ప్రత్యేక మార్గదర్శకాల్ని అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఒక షాపులో ఎంతమందిని అనుమతించాలన్న విషయాన్ని.. ఆ షాపు విస్తీర్ణం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ప్రతి మాల్ లో తప్పనిసరిగా ఉండే.. గేమింగ్ జోన్.. పుడ్ కోర్టుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారనుందని చెప్పక తప్పదు.