ఏపీలో జిల్లాల సంఖ్య మరింత పెరుగుతుందా? ఇప్పటికే ప్రబుత్వం ప్రకటించిన జిల్లాల సంఖ్యకు అదననంగా.. మరికొన్ని జిల్లాలు ఏర్పడనున్నాయా? అంటే.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను బట్టి.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. అయితే. ప్రతిపార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానని.. ఎన్నికల సమయంలోనే వైసీపీ అదినేత , ప్రస్తుత సీఎం జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుకూలంగా.. ఆయన ఇటీవల 13 కొత్త జిల్లాలను ప్రకటించారు.
అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలుగా ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలు అయ్యాయి. అయితే.. జిల్లాల ప్రకటన తర్వాత... అనేక డిమాండ్లు తెరమీదికి వస్తున్నాయి. కొన్ని జిల్లాలకు పేర్లు మార్చాలని.. మరికొన్ని జిల్లాలకు ప్రభుత్వం ప్రతిపాదించిన జిల్లా కేంద్రాలను కూడా మార్చాలని.. పెద్ద ఎత్తున ఆందోళనలు తెరమీదకి వచ్చాయి. ముఖ్యంగా రాయల సీమలో ఈ ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరు,, కడప జిల్లాల్లో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయాలని ఇక్కడిప్రజలు కోరుతున్నారు.
ముఖ్యంగా రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేయాలనినిర్ణయించిన అన్నమయ్య జిల్లాపై తీవ్రస్థాయిలో ఇక్కడి ప్రజలు కదం తొక్కుతున్నారు. రాజంపేటను కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లా ప్రకటించాలని కోరుతున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని కర్ణాటక బోర్డర్లో ఉన్న మదనపల్లిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని.. మదన పల్లి జిల్లా కోసం.. ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని.. ఇక్కడి ప్రజలు అంటున్నారు. అదే సమయంలో- కర్నూలు జిల్లాలోని ఆదోని లేదా, అనంతపురం జిల్లాలోని గుంతకల్లును కేంద్రంగా చేసుకుని మరో జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఆదోని కూడా కర్ణాటక సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ వంటి ప్రాంతాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఆదోనిని కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇక్కడి ప్రజలు అంటున్నారు. మరోవైపు భీమవరం కేంద్రం గా ఏర్పాటు చేయాలని భావించిన నరసాపురం జిల్లాను కాకుండా.. భీమవరం జిల్లా ఏర్పాటు చేయాలని ఇక్కడ డిమాండ్ వినిపిస్తోంది. అదేవిధంగా శ్రీకాకుళంలో పాలకొండ కేంద్రంగా కాకుండా.. పాలకొండ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇక, విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా పేరును రంగా జిల్లాగా మార్చాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రబుత్వం ఏంచేస్తుందో చూడాలి. జిల్లాలపై అభ్యంతరాలకు ఈ నెల 26వ తేదీ వరకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే.