అంతా అనుకున్నట్లుగానే తెలంగాణలోనూ మద్యం విక్రయాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గేట్లు ఎత్తేశారు. ఇతర రాష్ట్రాల్లో రెడ్ జోన్లలో మద్యం విక్రయాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నో చెబితే.. అందుకు విరుద్ధంగా వ్యవహరించిన కేసీఆర్.. రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలకు ఓకే చెప్పేశారు. అయితే రాష్ట్రంలో ఉన్న 11 కంటైన్మెంట్ జోన్లలో మాత్రం మద్యం విక్రయాలకు అనుమతి లేదని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సుధీర్గంగా సాగిన కేబినెట్ భేటీ తర్వాత రాత్రి 10 గంటల సమయానికి స్వయంగా మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్... మందు బాబులకు తీపి కబురు చెప్పారు.
మద్యం విక్రయాలకు దేశవ్యాప్తంగా అనుమతి ఇస్తూ నరేంద్ర మోదీ సర్కారు గత వారకే ఉత్తర్వులు జారీ చేయగా... నిన్న ఏపీ సహా పలు రాష్ట్రాలు మద్యం విక్రయాలను ప్రారంభించాయి. ఏపీలో పెద్ద ఎత్తున రద్దీ నెలకొనగా... ఇతర రాష్ట్రాల్లోనూ అదే తరహాలో మద్యం కోసం జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఘటలను గుర్తు చేసుకున్న పలువురు తెలంగాణలో మద్యం విక్రయాలకు కేసీఆర్ నో చెబుతారని భావిస్తే... మెజారిటీ జనం మాత్రం కేసీఆర్ కూడా మద్యం విక్రయాలకు కేసీఆర్ ఓకే చెబుతారని ఆశించారు. మెజారిటీ వర్గం ఆశించినట్లుగానే తెలంగాణలో మద్యం విక్రయాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మద్యం విక్రయాలకు పచ్చ జెండా ఊపుతూ కేసీఆర్ ఏమన్నారన్న విషయానికి వస్తే... దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు తెలంగాణలోనూ మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటు రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు ప్రారంభిస్తాం. అయితే రాష్ట్రంలోని 11 కంటైన్మెంట్ జోన్లలో మాత్రం మద్యం విక్రయాలకు అనుమతి లేదు. అంతేకాకుండా మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తున్నా... బార్లు, పబ్ లకు ఎలాంటి అనుమతి లేదు. మద్యం ధరలను 16 శాతం పెంచుతూ విక్రయాలకు అనుమతి ఇస్తున్నాం. మద్యం విక్రయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నాం’’ అని కేసీఆర్ చెప్పారు. మొత్తంగా ఇతర రాష్ట్రాలకు భిన్నంగా రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్... మద్యం ధరలను కూడా ఏపీ మాదిరిగా భారీగా పెంచకుండా కేవలం 16 శాతం పెంపెదలతోనే సరిపెడుతున్నట్లుగా ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.