దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన విప్రోను పూర్తిగా లేదా కొన్ని యూనిట్లను విక్రయించే ప్రతిపాదనతో విప్రో ప్రమోటర్ - చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ - ఆయన కుటుంబం సంస్థ నుంచి పాక్షికంగా లేదా పూర్తిగా వైదొలగాలనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై ప్రేమ్ జీ తీవ్రంగా కలత చెందారు. తమ వాటాకెంత విలువ లభిస్తుందని తెలుసుకునేందుకు ప్రేమ్ జీ కుటుంబం బ్యాంకులను సంప్రదించిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని తాజాగా ఉద్యోగులను ఉద్దేశించి రాసిన లేఖలో ప్రేమ్‌జీ స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలనీ, నిరాధారమైన ఇలాంటి పుకార్లను నమ్మవద్దంటూ లేఖలో ప్రేమ్ జీ ఉద్యోగులను కోరారు.
విప్రోకు వ్యాపార రంగంలో పెద్ద ఎత్తున ఆదరణ ఉందని, దీన్ని నిలబెట్టుకునేందుకు, ఇదే రీతిలో ముందుకు సాగేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతుంటాయని లేఖలో ప్రేమ్ జీ స్పష్టం చేశారు. విప్రోకు ఎంతో మంచి భవిష్యత్ ఉందని, సదరు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కూరగాయలు, నూనెల వ్యాపారంతో దాదాపు యాభై ఏళ్ల క్రితం ఆవిర్భవించిన విప్రో అంచెలంచెలుగా ఎదిగి టెక్నాలజీ రంగంలో టాప్ స్థాయికి చేరిందని ప్రేమ్ జీ గుర్తు చేశారు. అదే స్పూర్తితో మరింత ముందుకు తీసుకుపోతామని స్పష్టం చేశారు.
కాగా, ప్రేమ్ జీ ఫ్యామిలీకి విప్రోలో 73 శాతానికి పైగా వాటా ఉంది. తమ వాటాకెంత విలువ లభిస్తుందని తెలుసుకునేందుకు ప్రేమ్ జీ కుటుంబం బ్యాంకులను సంప్రదించిందని మీడియా వార్తలు వెలువరించింది. సంస్థ విలువను లెక్కగట్టాల్సిన బాధ్యతను బ్యాంకులకు అప్పగించినట్లు మీడియాలో కథనలు వచ్చాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/