ఆ పెద్దింటి గుట్టు బయటకు వచ్చింది

Update: 2016-06-16 04:39 GMT
తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన పెద్దింటి కుటుంబాల మాదిరే ఒడిశాలో త్రైలోక్యనాథ మిశ్రా ప్రముఖ పారిశ్రామికవేత్త. పేరు ప్రఖ్యాతులు పుష్కలంగా ఉన్న ఆ ఇంటి కోడలు బయటకు అడుగు పెట్టారు. నేరుగా పోలీసుల్ని ఆశ్రయించారు. అదిప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకిలా అంటే.. అత్తింట్లో వేధింపులు మాత్రమే కాదు.. భర్త ఆరాచకాల్నిబయటపెట్టేందుకు భార్య సిద్ధం కావటం.. అందుకు సంబంధించి శాంపిల్ గా కొన్ని అంశాలు బయటకు చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒడిశా రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో లోపముద్ర మిశ్రాకు 2006 జనవరిలో పెళ్లి జరిగింది.

గడిచిన పదేళ్లలో తాను పలు వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని లోపముద్ర చెబుతున్నారు. తాజాగా భువనేశ్వర్ లోని బర్ గడ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె.. భర్త.. అత్తా..మామల మీద ఫిర్యాదు చేసింది. పెళ్లి అయిన కొత్తల్లో హనీమూన్ వెళ్లినప్పుడు భార్యల్ని మార్చుకోవటం (వైఫ్ స్వైపింగ్) గురించి ప్రతిపాదించాడని.. అందుకు తాను ఒప్పుకోలేదని ఆమె వాపోయారు. అలా పెళ్లి అయిన మొదటి నుంచే తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా పేర్కొన్నారు. అత్తమామలు.. భర్త కారణంగా తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో.. తాజాగా ఆమె బర్ గడ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ ఫిర్యాదు మీడియాలో ప్రముఖంగా రావటం.. పెద్ద ఎత్తున చర్చ షురూ కావటంతో పోలీసు వర్గాలు అలెర్ట్ అయ్యాయి. ఈ ఉదంతం మీద తక్షణమే చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ పెద్దింటి యవ్వారం మరెన్ని మలుపులు తిరుగుతుందో..?
Tags:    

Similar News