ప్రియుడి తో సుఖం కోసం కన్న కూతురునే బలిచేసిన కసాయి తల్లి ఉదంతం షాక్ కు గురిచేస్తోంది. తన అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి ఏకంగా ప్రియుడికి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసింది కసాయి తల్లి. ఓ వైపు కట్టుకున్న భర్త, కన్నతల్లి మధ్యన ఈ పాడు సంబంధం చూసి తట్టుకోలేక ఆ నవవధువు బలి అయిపోయింది. ఈ దారుణం హైదరాబాద్ నగరం లో సంచలనమైంది.
హైదరాబాద్ లోని మీర్ పేట అల్మాస్ గూడకు చెందిన వేలూరి అనిత కొన్నేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. క్యాటరింగ్ పనులు చేస్తూ పిల్లల తో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు నవీన్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఇక అనిత కూతురు పెళ్లీడుకొచ్చింది. ఈ క్రమంలో తన ప్రియుడు నవీన్ ను పెళ్లి చేసుకుంటే సమాజం, కూతుళ్లు ఒప్పుకోరని అనిత ఆలోచించింది. అందుకే ప్రియుడితో కలిసి వీరి బంధం కలకాలం సాగేలా మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రియుడు నవీన్ ను వదిలి ఉండలేక ఏకంగా కన్న కూతురిని బలిపశువును చేసింది. ప్రియుడు నవీన్ కు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పెద్ద కూతురు వందన (19)ను ఇచ్చి పెళ్లి చేసింది తల్లి.
అయితే తల్లి తో భర్త నవీన్ కు ఉన్న అక్రమ సంబంధం వందనకు తెలియదు. కొత్త ఆశలతో కాపురంలోకి అడుగుపెట్టిన ఈ నవ వధువుకు భర్త-తల్లి మధ్యన అక్రమ సంబంధం తెలిసింది. రోజు భర్త వచ్చి తల్లి తో వివాహేతర సంబంధం నడపడం చూసి తట్టుకోలేకపోయింది. భర్త తో, తల్లితో గొడవపడింది. వేరు కాపురం పెడదామని భర్తపై ఒత్తిడి తెచ్చింది. ప్రియుడు నవీన్ దూరమవుతాడని తల్లి అనిత ఒప్పుకోలేదు. చచ్చిపోతానంటూ బెదిరించింది. భర్త, తల్లి అక్రమసంబంధం తట్టుకోలేక నరకం అనుభవించిన వందన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ లో తల్లి, భర్త రాసలీలలను బయటపెట్టింది. దీంతో తల్లి, భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు.