బీసీసీఐ పై మహిళా క్రికెటర్ల ఆగ్రహం..!

Update: 2021-05-24 04:34 GMT
సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు వివక్షకు గురవుతూ ఉంటారు. వీటిపై ఎన్నోపోరాటాలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే క్రికెట్​ విషయంలోనూ మహిళా క్రికెటర్లపై వివక్ష సాగుతుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. బీసీసీఐ పురుష క్రికెటర్ల విషయంలో పక్షపాతం చూపిస్తుందని  మహిళా క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇందుకు సంబంధించిన ఆరోపణలు ఊపందుకున్నాయి.

పురుష క్రికెటర్లకు వెంటనే ప్రైజ్​ మనీ ఇచ్చేసే.. బీసీసీఐ .. మహిళా క్రికెటర్ల విషయంలో వివక్ష చూపిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.  టీమిండియా ఇంగ్లాండ్​ టూర్​కు వెళ్లబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పురుషుల జట్టుకు, మహిళల జట్టుకు వేర్వేరుగా ఫ్లైట్లు బుక్​ చేయకుండా.. ఇద్దరినీ ఒకే ఫ్లైట్​లో పంపించారని.. కరోనా టెస్టుల విషయంలోనూ వివక్ష చూపించారన్న వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ విషయంపై మహిళా జట్టు ఆటగాళ్లు మిథాలీ రాజ్​, హర్మన్​ ప్రీత్​ మీడియా ముందుకొచ్చి మాట్టాడారు. మాపై ఎటువంటి వివక్ష లేదని చెప్పుకొచ్చారు. అయితే ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ వారితో ఈ ప్రకటన చేయించిందని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా జీతాల చెల్లింపులో బీసీసీఐ వివక్ష చూపించదన్న వాదన తెరమీదకు వచ్చింది.

2020లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ లో భారత మహిళల జట్టు ఫైనల్‌ కు చేరుకున్నది. అయితే అప్పుడు ఇండియా రన్నరప్‌ తో సరిపెట్టుకుంది. మెగా టోర్నీలో రన్నరప్‌ గా నిలిచిన భారత మహిళల జట్టుకు ఐసీసీ  5లక్షల డాలర్లు( భారత కరెన్సీలో రూ.3.6 కోట్లు) ప్రైజ్‌మనీ ఇచ్చింది. ఇంతవరకు బీసీసీఐ ఆ ప్రైజ్‌మనీని మహిళా క్రికెటర్లకు పంపిణీ చేయలేదని సమాచారం. టీ 20 ప్రపంచకప్‌ లో పాల్గొన్న 15 మంది జట్టులో ఒక్కో ప్లేయర్‌ కి 33వేల డాలర్లు అందుతుంది( ఇండియన్‌ కరెన్సీలో రూ. 24లక్షలు). పురుషుల కు వెంటనే ప్రైజ్​ మనీ ఇచ్చే బీసీసీఐ మహిళల విషయంలో వివక్ష చూపుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News