సమాజంలో ఇప్పటి వరకు మహిళలే అన్ని విషయాల్లో బాధితులుగా ఉన్నారు. ముఖ్యంగా మహిళల మాన.. ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోకుండా పొవడం శోచనీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే మహిళల కోసం రక్షణ కోసం పాలకులు అనేక సంస్కరణలు.. చట్టాలు తీసుకొచ్చారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉండటం బాధాకరం.
ఢిల్లీలో నిర్భయ.. హైదరాబాద్లో 'దిశ' లాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహిళల రక్షణ కోసం 'నిర్భయ'.. 'దిశ' వంటి చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది. వీటికి తోడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు షి టీమ్స్ తరహా కార్యక్రమాలను అమలు చేయడంతో కొంతమేరకు వారిలో భరోసా వచ్చింది.
మరోవైపు యూపీ.. పంజాబ్.. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో మాత్రం తరుచూ మహిళలపై దారుణలు వెలుగు చూస్తుండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. ఈ రాష్ట్రాల్లో మహిళలే రక్షణ లేదని అంతా భావిస్తుండగా.. ఇప్పుడు మగవాళ్లకు కూడా రక్షణ కరువైందని తాజాగా వెలుగు చూసిన ఘటన రుజువు చేస్తోంది.
పంజాబ్ జలంధర్ లో ఓ యువకుడిని నలుగురు మహిళలు సామూహిక అత్యాచారం చేశారనే ఘటన అందరినీ ఉలికిపాటుకు గురిచేస్తోంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పంజాబ్ లోని జలంధర్ కపూర్తలా ప్రాంతంలోని ఓ లెదర్ కాంప్లెక్స్ రోడ్డులో ఓ యువకుడి పని చేస్తున్నాడు. మధ్యాహ్నం అతడి పని ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో ఒక కారు వచ్చి ఆగింది.
అందులోని నుంచి నలుగురు యువతులు దిగి అతడిని ఒక అడ్రస్ అడిగారు. తమకు అడ్రస్ చూపించమని కారులో ఎక్కించుకున్నారు. కారులోని అతడిపై నలుగురు యువతులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అతడిని ఓ చోట దించి వెళ్లిపోయారని బాధిత యువకుడు చెబుతున్నాడు.అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.
కాగా ఆ యువకుడు చెబుతున్న దానిని బట్టి చూస్తే రోడ్డుపై వెళ్లే ఆడవాళ్లకే కాదు మగవాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధిత యువకుడు చెబుతున్న దాంట్లో అసలు నిజం ఉందా? లేదా అనే తెలియాలంటే మాత్రం పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఘటనను పోలీసులు సుమోటోగా తీసుకుని విచారిస్తారో లేదో వేచి చూడాల్సిందే..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.