సాధారణంగా భారతీయ ఇండ్లలో ఎవరైనా చనిపోయినప్పుడు ఏడాదిలోగా ఆ ఇంట్లో పిల్లలు పుడితే చనిపోయిన వాళ్లే మళ్లీ పునర్జన్మ నెత్తిన ట్లు భావిస్తుంటారు. మరణించిన వారిని ఆ పిల్లల్లో చూసుకుంటూ.. ఆ పిల్లల చేష్టలను వారితో పోలుస్తూ ఆనందపడుతుంటారు. కొందరు చనిపోయిన తమ ఆత్మీయులను మరిచిపోవడానికి ఏ పిల్లినో.. శునకాన్నో తెచ్చుకుని పెంచుకుంటారు. ఆ మూగజీవుల్లో వారు కోల్పోయిన ఆత్మీయులను చూసుకుంటూ కాలం గడిపేస్తుంటారు. కర్ణాటకలో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కానీ అక్కడ ఆ వ్యక్తి తాను కోల్పోయిన వారిని చూసుకుంది పిల్లిలోనో.. శునకంలోనో కాదు పాములో. పాములోనే ఎందుకుంటే దానికీ ఓ కారణముంది.
పాము.. పేరు వింటేనే కొందరికి చెమటలు పట్టేస్తుంటాయి. కొందరు ఆ పేరు వింటేనే భయపడుతుంటారు. మరికొందరు పామును ఫొటోలల్లో కూడా చూడ్డానికి ఇష్టపడరు. ఇంకొందరేమో దేవుడిగా భావించి పూజలు చేస్తూ ఆరాధిస్తుంటారు. కానీ ఎక్కువ మంది మాత్రం పాముని చూడగానే ఆమడ దూరం వెళ్తారు. అది ఎక్కడ తమను కరుస్తుందోనని జంకుతుంటారు. కానీ కర్ణాటకలోని ఓ మహిళ మాత్రం అలా పాముని చూసి భయపడలేదు. భయపడకపోగా తన ఇంట్లోనే ఉంచుకుని పెంచుకుంటోంది.
కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లా వాడిప్పట్టి తాలూకాలోని కులహళ్లి అనే గ్రామంలో మోనేషా కంబారా అనే వృద్ధురాలు తన భర్తతో నివసిస్తుండేది. రెండేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. అప్పటి నుంచి అతడి జ్ఞాపకాలతోనే ఆమె కాలం వెళ్లదీస్తోంది. ఎప్పుడు భర్త గురించే ఆలోచిస్తూ బతుకుతున్న ఆమె ఇంట్లోకి నాలుగు రోజుల క్రితం ఓ నాగుపాము వచ్చింది. పాముని చూసి మొదట్లో అందరిలాగే ఆమె కూడా భయపడింది.
కానీ తర్వాత.. ఆ పాములో తన భర్త ఉన్నాడని భావించింది. తనను చూడటానికి భర్త పాము రూపంలో వచ్చాడని నమ్మింది. దానికి రోజు పాలు పోస్తూ బాగోగులు చూసుకుంటోంది. నాలుగు రోజులుగా ఆ పాము ఆమె ఇంట్లోనే ఉంది. ఆ వృద్ధురాలు ఆ సర్పాన్ని బయటకు పంపించేందుకు కూడా ప్రయత్నించలేదు. పాము ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఏమైందోనని పక్కింటి వాళ్లు ఆమె ఇంటికి వెళ్తే అసలు విషయం తెలిసింది.
ఆమె ఇంట్లో పాము ఉందని తెలుసుకున్న ఇరుగుపొరుగు ఆ సర్పాన్ని పట్టుకుని బయటకు పంపించాలని గ్రామస్థులను కోరారు. పామును పట్టుకోవడానికి వచ్చిన వారిని ఆ మహిళ ఇంట్లోకి రానీయలేదు. తన భర్త పాము రూపంలో వచ్చాడని ఆ సర్పాన్ని పట్టుకోవద్దని వారిని వేడుకుంది. పాము చాలా ప్రమాదకారి అని.. ఏ క్షణంలోనైనా తనని కాటేయవచ్చని గ్రామస్థులు ఆమెకు చాలా నచ్చజెప్పి చూశారు. కానీ ఆ మహిళ అవేం పట్టించుకోలేదు. అయినా పాముని పట్టుకోవడానికి గ్రామస్థులు ప్రయత్నించగా.. ఆ వృద్ధురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఆమె పరిస్థితిని చూసిన స్థానికులకు జాలి కలిగింది. ఇక చేసేదేం లేక పామును పట్టుకునే ప్రయత్నం విరమించుకున్నారు. చనిపోయిన భర్త పాము రూపంలో వచ్చాడని ఆ వృద్దురాలు ఇంట్లోనే సర్పాన్ని ఉంచుకోవడంతో ఆ ప్రాంతమంతా ఈ విషయం చర్చనీయాంశమైంది. భర్త పోయిన బాధలో వృద్ధురాలు మతిస్థిమితం కోల్పోయినట్లుందని కొందరు భావిస్తున్నారు.