ఆంధ్ర నడిబొడ్డు విజయవాడకు చెందిన టీడీపీ నేత - మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి విపక్ష వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్‌తో రవి ఏకాంతంగా భేటీ కాగా, జగన్ కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీలోకి వచ్చినందుకు రవికి జగన్ అభినందనలు తెలపడమే కాకుండా తాను అస్సలు ఊహించలేదని కూడా అన్నట్లు సమాచారం.
అంతేకాకుండా టిక్కెట్ విషయంలోనూ అప్పటికప్పుడు హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. తాను వైకాపాలోకి వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే సీటును ఆశిస్తున్న ఆశావహులకు ఇబ్బంది కలుగుతుందేమోనని రవి ప్రస్తావించగా, ఇప్పటివరకూ ఎవరికీ ఎటువంటి కమిట్ మెంట్ ను తాను ఇవ్వలేదని జగన్ స్పష్టం చేసినట్టు వైకాపా వర్గాలు అంటున్నాయి. దీంతో విజయవాడ ఈస్ట్ టిక్కెట్ రవికి ఇచ్చినట్లేనని చెప్తున్నారు.
ఈ నెల 14న శనివారం నాడు జగన్ పాదయాత్ర విజయవాడకు చేరనుండగా, తన అనుచరులతో వచ్చి యలమంచిలి రవి వైకాపాలో చేరనున్నారు. టీడీపీలో సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రవి వ్యాఖ్యానించారు. కాగా రవికి టిక్కెట్ ఇస్తే ప్రస్తుతమున్న సమీకరణల ప్రకారం ఆ సీటు వైసీపీ ఖాతాలో పడినట్లేనన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి.