జగన్ కు యనమల ఎందుకు ఫోన్ చేశారు?

Update: 2015-07-13 06:14 GMT
వైసీపీ నాయకుడు జగన్ కు టీడీపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫోన్ చేశారు... ఆయనకే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూ ఫోన్ చేశారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.. ఇంతకీ ఆయన ఫోన్ చేయడానికి కారణమేంటయి ఉంటుందా అని తలలుబద్దలుగొట్టుకోనవసరం లేదు.. రాజకీయ కారణాలు ఇందులో లేనేలేవు. ప్రతిష్ఠాత్మక గోదావరి పుష్కరాలకు రావాల్సిందిగా ప్రభుత్వం తరఫున యనమల వారిని ఆహ్వానించారు. అదీ కథ.

రేపటి నుంచి ప్రారంభం కానున్న పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని పార్టీలనూ ఆహ్వానించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలకు రావలసిందిగా బీజేపీ, వైకాపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలను తెలుగుదేశం ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వయంగా ఆయా పార్టీల నాయకులకు ఫోన్ చేసి పుష్కరాలకు రావలసిందిగా ఆహ్వానించారు  ఏపీలోని అన్ని పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పుష్కరాలు జరుగుతున్నాయి. యనమల స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలుకుతుండటం గమనార్హం. మంగళవారం ఉదయం గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. యనమల.. ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బిజెపి, జనసేన పార్టీలకు ఫోన్ చేసి ఆహ్వానించారు.
Tags:    

Similar News