కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గెలుపే ధ్యేయంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 20వ వార్డు అభ్యర్థి ఎ. మునిరత్నం పేరుతో ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనను గెలిపిస్తే ఆర్. ఆర్ హాస్పిటల్ హెల్త్ కార్డు ఇస్తానని, దీని సాయంతో రాయితీలో కూడిన వైద్య సేవలు కల్పిస్తానని ఎ. మునిరత్నం పేరుతో ఉన్న చీటీలు సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి.
ఆర్ ఆర్ హాస్పిటల్ ఉచిత డాక్టర్ కన్‌సెల్టేషన్ కల్పిస్తామని చెబుతున్నారు. అన్ని రకాల ల్యాబ్ పరీక్షలపై 20 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. హెల్త్ కార్డు లబ్దిదారుడు కొన్న మందుల్లో 15 శాతం తగ్గిస్తామని తెలిపారు. అలాగే 1000 రూపాయలు విలువ చేసే రక్త పరీక్షల్లో ప్రతి సంవత్సరము అనగా 5 ఏళ్లు ఉచితంగా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్డు యొక్క కాల పరిమితి 2021 నవంబర్ నెల 17 నుంచి, 2026 నవంబర్ నెల 16 వరకు ఆర్ ఆర్ హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.
హెల్ కార్డు తెచ్చిన ప్రతిసారి ఐడీ ప్రూప్ తప్పనిసరిగా తీసుకురావాలని నిబంధన పెట్టారు. కార్డుదారుడికి తప్ప వేరే వారికి వర్తిందని నిమయం పెట్టారు. ఈ ఈ సదుపాయం 20వ వార్డు వైసీపీ అభ్యర్థి ఎ. మునిరత్నంను గెలిపిస్తే హాస్పటల్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ చీటీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎన్నికలు అధికారులు దృష్టిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.