ఇదీ భ‌రోసా అంటే... బాబూ విన్నావా?

Update: 2018-11-15 13:46 GMT
చంద్ర‌బాబు వ‌స్తే రైతుకు భ‌యం. రైతుకు స‌మ‌స్య లేని సంద‌ర్భం చంద్ర‌బాబు హ‌యాంలో ఉండ‌దు. అది క‌ర‌వో - వ‌ర‌దో - తుపానో - అవేవీ లేక‌పోతే భూముల స్వాధీనం. మొత్తానికి ఏదో ఒక కార‌ణంతో రైతుకు మాత్రం బాబు పాల‌న‌లో ఇబ్బంది త‌ప్ప‌దు. రాజధాని లంక అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ - వైఎస్సార్‌ సీపీ నాయకుల బృందం గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించింది. రైతుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు విన్న‌ది. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చంద్ర‌బాబు విధానాల‌పై తీవ్రంగా దుమ్మెత్తిపోశారు.

రైతులు ఉసురుపోసుకుంటూ చంద్ర‌బాబు వారి భూములు లాక్కున్నార‌ని ఆరోపించిన ఆయ‌న‌ తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను బెదిరించి ప్రభుత్వం కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను తిరిగి వారికి అప్ప‌గిస్తామని అన్నారు. చంద్ర‌బాబు రాక‌ముందు అమ‌రాతి ప్రాంతం ప‌చ్చ‌టి పొలాల‌తో అల‌రారేది. బాబు వ‌చ్చాక ఎర్ర‌టి మ‌ట్టితో వ‌డ‌లిపోయింది. చంద్ర‌బాబు నేరాలు - ఘోరాల్లో క్యారెక్ట‌ర్ అని... ఎపుడో ఏదో ఒక త‌ప్పు చేస్తూ దొరికిపోతూ ఉంటాడ‌న్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి పారిపోయి అమరావతికి వచ్చారని వ్యాఖ్యానించారు. అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్న‌ చంద్రబాబుతో పాటు త‌ప్పుడు దారిలో న‌డుస్తున్న అధికారుల‌ను కూడా వ‌ద‌ల‌ను అని చెప్పారు.  

దళితుల పట్ల వివక్ష:

పట్టా భూములకు ఒక ప్యాకేజీ - దళితులు అసైన్డ్ భూములకు మరొక ప్యాకేజీ ఇవ్వటం దారుణం. రాజధానిలో ప్రభుత్వం రైతుల ప‌ట్లే కాదు, దళితుల పట్ల కూడా వివక్ష చూపుతోంది.  రైతు  ఎవ‌రైనా రైతే. అమ‌రావ‌తి రాక‌పోతే అంద‌రి ఆదాయం ఒక‌టే. కానీ రాజ‌ధాని రావ‌డంతో ద‌ళితులు మాత్రం న‌ష్ట‌పోయారు.

- నందిగం సురేష్‌ - ఛైర్మ‌న్‌ - రాజధాని లంక అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ

దళితులు పండించుకునే భూములను తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏం హ‌క్కుంది? బాబు పాల‌న‌లో రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు - అన్యాయాలు పెరిగాయి. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో దళితులే బుద్ది చెబుతారు. దళితులకు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి దేవుడిలా ఉన్నారు. ఆయ‌న క‌చ్చితంగా ప్ర‌తి ద‌ళితుడి స‌మ‌స్య తీరుస్తారు.

- మేరుగుల నాగార్జున
Tags:    

Similar News