స్థానిక సంస్థల ఎన్నికల సమయం లో ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు బోండా ఉమా , బుద్ధా వెంకన్నలపై దాడి జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిన్న మాచర్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ శ్రేణులు అడ్డుపడ్డారని తెలియడం తో, అధినేత ఆదేశాల మేరకు బోండా, బుద్ధా బుధవారం మాచర్లకు వెళ్లిన సమయం లో పట్టణం నడిబొడ్డున వారిద్దరూ ప్రయాణించిన కారుపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీనితో ఈ దాడి చేసింది వైసీపీకి చెందినవారే అంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే ఆ దాడి పై పోలీసులు కూడా ఊదాసీనంగా వ్యవహరించారని విమర్శించారు
ఇకపోతే , ఈ ఘటనపై మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. అసలు టీడీపీ నేతలపై దాడికి దిగడానికి గల అసలు కారణం చెప్పుకొచ్చారు. కాన్వాయ్ లాగా మాచర్ల టౌన్ లోకి దూసుకొచ్చిన టీడీపీ నేతల వాహనాల్లో ఒకటి.. రోడ్డు దాటుతోన్న పిల్లాడిని ఢీకొట్టిందని, ఇరుకు రోడ్డులో అంత స్పీడుగా ఎందుకు వెళుతున్నారని స్థానికులు నిలదీయడం తో... కారులో కూర్చున్న బోండా, ఇతర నేతలు దుర్భాషలాడారని, దీనితో రెచ్చిపోయిన స్థానికులు, తమ సత్తా ఏంటో చూపించారని ఎమ్మెల్యే తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఇలాంటి పనులకు పాల్పడుతోందని పిన్నెల్లి ఆరోపించారు. ఇందులో భాగంగానే 10 కార్లలో వచ్చి గొడవకు దిగారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం.. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చుపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే బోండా, బుద్ధాలు బుధవారం విజయవాడ నుంచి 10 కార్లలో గుండాలను వెంటేసుకుని మాచర్లకు వచ్చారని ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. అలాగే ఇదే పల్నాడు ప్రాంతంలో 2014లో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ముస్తఫాలపై దాడి చేశారని, ఈ మద్యే రైతుల ముసుగు లో అమరావతి లో తనపై దాడి చేశారని మండిపడ్డారు.