ఆరోగ్య శ్రీ ..పేద , మధ్య తరగతి వారికీ అతి పెద్ద భరోసా అని చెప్పవచ్చు. పేద , మధ్యతరగతి వారికీ కూడా మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ పథకానికి అప్పట్లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభిస్తే ..ఈ మధ్య మళ్లీ అయన తనయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అందులో ఇంకొన్ని జబ్బుల్ని చేర్చుతూ ఆరోగ్య శ్రీ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే తాజాగా వైసీపీ కి చెందిన ఒక ఎంపీ ఆరోగ్య శ్రీ లో కడుపుమంట ని కూడా చేర్చాలని ప్రభుత్వాన్ని ఒక సలహా ఇచ్చాడు. అసలు కడుపుమంట ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చాలి ..అలాగే అసలు ఆ సలహా వైసీపీ ఎంపీ ఎందుకు ఇచ్చారు అని అనుకుంటున్నారా ..అయితే దీని వెనుక ఒక ట్విస్ట్ ఉంది..అదేమిటంటే ..?
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి పై చేస్తున్న సంచలన వ్యాఖ్యలకి బదులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అ ఇలా కౌంటర్ ఇచ్చారు. కడుపు మంటను ఆరోగ్య శ్రీలో చేర్చాలని చంద్రబాబు సీఎం జగన్‌ను కోరవచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. రాష్ట్ర వ్యాపత్ంగా అన్ని జిల్లాల నుంచి వైజాగ్ వెళ్లలేనంత దూరంలో ఉందని రెచ్చగొట్టడానికి కిరసనాయిలు మ్యాప్ వేసి పేజి అంతా పర్చారని ఆరోపించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలు మధ్యలో లేవని ప్రజలందరికీ తెలుసు. దీనికంటే కడుపు మంటను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని కోరవచ్చు గదా? అని సలహా ఇచ్చారు.
అలాగే అమరావతిని రక్షించుకో లేకపోతే చనిపోయినట్టేనట.. రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తం గా యువత ఆందోళన చేయాలట.. ‘మీ (చంద్రబాబు) బినామీలు, సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడటానికి ప్రజలంతా సమిధలు కావాలా? మీ లాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి?’అన్నారు బాబు పై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.