వైసీపీ విప్పేసిన ప‌వ‌న్ గుట్టు.. ఏంటంటే...!

Update: 2022-12-02 00:30 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుట్టును వైసీపీ తెలుసుకుంద‌నే వాద‌న వినిపిస్తోంది. స‌హ‌జంగా రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్తి పార్టీలు ఏం చేస్తున్నాయి?  అవి ఎలాంటి అడుగులు వేస్తున్నాయ‌నే విష‌యాన్ని ప‌లు పార్టీలు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటా యి. ఈ విష‌యాన్ని పార్టీలు ప‌సిగ‌ట్టి ప్ర‌త్య‌ర్తి పార్టీల‌కు అంతుచిక్క‌ని రీతిలో ప్రతి వ్యూహాలు వేసుకుని ముందుకు సాగుతుంటాయి. అయితే, జ‌న‌సేన‌లో ఇలాంటి ప్ర‌తివ్యూహాలు, వ్యూహాలు కూడా క‌రువ‌య్యాయ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అదికారంలోకి వ‌చ్చేస్తామ‌ని చెబుతున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తార‌నేది ఇప్ప‌టికీ ఒక ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది. అయితే, ప‌వ‌న్ చెప్ప‌ని, అన‌ని వ్యూహాన్ని వైసీపీ నేత‌ల నోటి నుంచి వినిపిస్తుండ‌డం దానికి త‌గిన విధంగా ముందుకు వెళ్ల‌డం వంటివి ఇప్పుడు ఆస‌క్తిగా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ బీజేపీకి రాం రాం చెబుతాడ‌ని, టీడీపీతో చేతులు క‌ల‌పడం ఖాయ‌మ‌ని.. వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. టీడీపీ ఇచ్చే సీట్ల‌పై కూడా వారు చెబుతున్నారు.

``వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీతో క‌లిసి ప‌వ‌న్ ముందుకు వెళ్తార‌ని మేం భావిస్తున్నాం. మాకు స‌మాచారం కూడా ఉంది. ప‌వ‌న్ 30 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారు. అదేస‌య‌మంలో రెండు ఎంపీ స్థానాలు అడుగుతున్నారు. కానీ, టీడీపీ మాత్రం 15 అసెంబ్లీ స్థానాలు ఇస్తామ‌ని చెబుతోంది. ఒక ఎంపీ సీటును మాత్రం ఇస్తామ‌ని చెబుతున్న‌ట్టు మాకు స‌మాచారం ఉంది. మ‌రి .. దీనిని బ‌ట్టి ఎవ‌రు సీఎం అవుతారో.. ఎవ‌రికి ఆ అవ‌కాశం ద‌క్కుతుందో వారే తేల్చుకోవాలి`` అని కీల‌క వైసీపీ నాయ‌కులు తాజాగా బ‌హిరంగ వ్యాఖ్య‌లే చేశారు.

దీనిని లైట్‌గా తీసుకునే అవ‌కాశం లేదు. వైసీపీ నేత‌లు అందునా అధిష్టానంతో నిత్యం ట‌చ్‌లో ఉన్న నాయ‌కులే ఇలా వ్యాఖ్యానించారంటే దీనిపై వారికి స‌మాచారం ఉండే ఉంటుంది. మ‌రి ఇలాంటి వ్యాఖ్య‌ల వ‌ల్ల .. వైసీపీ న‌ష్టం క‌న్నా జ‌న‌సేన‌కు డ్యామేజీ ఏర్ప‌డుతుంద‌ని అంటున్నారు. ఎందుకంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు.

కానీ, వైసీపీ చేస్తున్న ఈ కామెంట్ల వ‌ల్ల ప్ర‌జ‌లు నిజ‌మ‌ని అనుకుంటే.. జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేదు. కేవ‌లం 15 స్థానాల‌కే ప‌రిమితం అవుతుంద‌నే ప్ర‌చారం జ‌రిగితే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై జ‌న‌సేన నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News