గందరగోళంలో వైసీపీ సోషల్ మీడియా

Update: 2022-09-14 12:30 GMT
వైసీపీ సోషల్ మీడియా స్ట్రక్చర్ పూర్తిగా మారింది. ఆ పార్టీలో కీలకమైన నేతగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి కుమారుడిని ఇంచార్జిగా చేశారు. ఇక అతనికీ సోషల్ మీడియాకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదు,  ఏ రకమైన బాండింగ్ కూడా లేదు అని అంటున్నారు. సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో అతనికి పెద్దగా అనుభవం లేదని, ఎలాంటి డిగ్రీ కూడా లేదని అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో వైసీపీకి అత్యంత కీలకం అయిన సోషల్ మీడియా వింగ్ ని ఆయన ఎలా నడిపిస్తారు అని అంటున్నారు. నిజంగా అతనికి సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో చక్కటి అనుభవం ఉంటే కనుక అది ఆ పార్టీకి అదృష్టం గానే చూడాలని అని కూడా అంటున్నారు.

ఈ నేపధ్యంలో సడెన్ గా వచ్చిన సజ్జల భార్గవ్ కి సోషల్ మీడియాలోని పాత టీం సపోర్ట్ చేస్తుందా లేదా అన్న చర్చ కూడా మొదలైంది. ఇక గతంలో అయితే సోషల్ మీడియాలో కింగ్ లా వైసీపీ ఉంది. జగన్ని మాత్రమే నాడు చూసి అంతా ఒక్కటిగా సోషల్ మీడియాలో పనిచేశారు. ఒక రకంగా కుమ్మేశారు అని అనుకోవాలి.

దాని తాలూకా ఫలితాలు కూడా బాగానే వచ్చాయి. జగన్ 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మూడేళ్ళుగా సోషల్ మీడియా వింగ్ ని పట్టించుకునే నాధుడే లేడు. దాంతో అది పూర్తిగా వీక్ అయింది అన్న చర్చ ఉంది. అంతే కాదు నాడు గట్టిగా నిలబడిన వారు ఇపుడు ఎక్కడికక్కడ వర్గాలుగా విడిపోయారు.

దీంతో వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ వింగ్ కి ఊపిరి పోసి తిరిగి గాడిలో పెట్టాలన్నా ఒక పద్ధతిలో నడిపించాలన్నా కూడా విశేష అనుభవం ఉండాలి.  ఓపిక తీరిక కూడా చాలానే కావాలి. పైగా వైసీపీ సోషల్ మీడియా గురించి పూర్తిగా తెలిసిన వారు అయి ఉండాలి.

కానీ సజ్జల భార్గవ్ ని అకస్మాత్తుగా దింపుతున్నారు. ఆయన ఎక్కడో హైదరాబాద్ లో తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. ఆయనకు వైసీపీ సోషల్ మీడియా వింగ్స్ లో ఉన్న టీమ్స్ తో ఎలాంటి సంబంధాలు లేవు. పెద్దగా పరిచయాలు కూడా లేవు. ఈ రోజు నుంచి ఈయనే మీ ఇంచార్జి అని పార్టీ పెద్దలు నిర్ణయించి నెత్తిన పెట్టవచ్చు కాక కానీ ఆయనకు అంతా కొత్తగా వింతగా ఉంటుంది కదా.

ఇక అక్కడ ఉన్న వారికి సరిచేసి లైన్ లో పెట్టడం అంటే సామాన్య విషయం ఏ మాత్రం కాదని అంటున్నారు. పైగా ఇపుడు కమిట్మెంట్ తో పనిచెసే టీమ్స్ కూడా లేని చోట భార్గవ్ ఇది సవాల్ గానే ఉంటుంది అంటున్నారు. దాంతో అసలు వైసీపీ సోషల్ మీడియా  లో ఏం జరుగుతోంది. ఎందుకింత గందరగోళం అన్న చర్చ సాగుతోంది.

ఉన్న వారిలోనే మెరికల్లాంటి వారు లేరా, వారికి బాధ్యతలు అప్పగించి మొత్తం కధను జాగ్రత్తగ నడుపుకుంటే బాగా ఉంటుంది కదా అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా సజ్జల భార్గవ్ అంటే ఒక ప్రయోగం అని అంటున్నారు. ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలనే అంటున్నారు. ఇపుడు దీని మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్నాళ్ళూ పట్టకుండా వదిలేసి ఇపుడు పూటకో మార్పు రోజుకో చేర్పూ చేస్తూ సోషల్ మీడియా వింగ్ ని అంతా అయోమయం అన్నట్లుగా చేసి పారేశారు అన్న విమర్శలు అయితే గట్టిగా ఉన్నాయిట మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News