శ్రీలంకతో ఏపీని పోల్చడాన్ని వైసీపీ ఎంపీలు తప్పు పడుతున్నారు . ఇదెంత మాత్రం భావ్యం కాదని అయోధ్య రామిరెడ్డితో సహా పలువురు ఎంపీలు అంటున్నారు. నిన్నటి వేళ ఢిల్లీ కేంద్రంగా మోడీ వర్గం వినిపించిన మాటల కారణంగా వైసీపీ ఎంపీలు రియాక్ట్ అయ్యారు. వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన వైసీపీ ఎంపీలు మీడియా మీట్ నిర్వహించి మరీ ! కేంద్రం తీరును నిరసించారు.
రాజ్యసభ ఎంపీ అయ్యోధ్య రామిరెడ్డితో సహా ఎంపీలు తలారి రంగయ్య (అనంతపురం), ఎన్.రెడ్డప్ప (చిత్తూరు) మాట్లాడుతూ.. ఓ దేశానికి ఓ రాష్ట్రానికి ఏంటి పోలిక అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి కేంద్రం సాయం చేయకపోగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం తగదని అన్నారు.
శ్రీలంకలో గత మూడేళ్లుగా వాణిజ్య సంబంధ ఎగుమతులు తగ్గుముఖం పడుతున్నాయి కానీ మన రాష్ట్రంలో అందుకు భిన్నంగా స్థితిగతులు ఉన్నాయని వెల్లడించారు.
అభివృద్ధి, సంక్షేమం అన్నవి ప్రధాన ప్రాధాన్యాంశాలుగా తీసుకుని పాలన చేస్తున్న తమ సర్కారును ఉద్దేశించి కేంద్రం చేసిన వ్యాఖ్యలు నిర్హేతుకం అయినవి అని అభిప్రాయపడ్డారు. ఏదేమయినప్పటికీ ఇప్పటిదాకా పోలవరం పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాగుతున్నాయని వారు వివరించారు.
ఈ నేపథ్యంలో బీజేపీకి, వైసీపీకి ఉన్న స్నేహ బంధాలు అలానే ఉన్నాయి... ఇదంతా మీడియా ముందు హడావుడే అని టీడీపీ విమర్శిస్తోంది. అనుమానాస్పద ధోరణిగానే ఈ మాటలను తాము పరిగణిస్తున్నామ ని టీడీపీ వర్గం అంటోంది.
ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన హామీల అమలుపై గొంతుకలు వినిపించని వైసీపీ ఎంపీల తీరును తాము తప్పుపడుతున్నామని కూడా టీడీపీ అంటోంది. ముగ్గురు ఎంపీలున్న తామే రాష్ట్రం తరఫున అన్నీ తామై మాట్లాడుతూ పోరాటం చేస్తున్నామని అంటున్నది కూడా ! కానీ అంత మంది ఎంపీలుండి వైసీపీ ఏం చేస్తోందని ప్రశ్నిస్తోంది టీడీపీ.