జగన్ ను దొంగదెబ్బ తీస్తోన్న టీడీపీ

Update: 2019-12-26 06:32 GMT
ఏపీ సీఎం జగన్ ను డైరెక్టుగా ఎదుర్కోలేని టీడీపీ - చంద్రబాబు బృందం దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు తప్పుడు సమాచారంతో టీడీపీ - పచ్చమీడియా చేస్తున్న రాద్ధాంతంపై వైసీపీ ఫోకస్ చేసినట్టు తెలిసింది. చంద్రబాబు, దాని పచ్చ పీఆర్ వర్గాల్లో జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా కథనాలు వండివారుస్తున్నట్టు గుర్తించాయి..

తాజాగా వైసీపీకి వ్యతిరేకంగా నకిలీ ప్రకటనలు పెద్ద ఎత్తున జారీ అవుతున్నాయి.  గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు బ్రహ్మనపల్లికి చెందిన మౌలా అలీకి చెందిన 40 ఎకరాలను లాక్కొని ఆయనను తరిమివేశారని ప్రచారంలోకి వచ్చింది. నిజానికి ప్రభుత్వ వర్గాలు విచారిస్తే మౌలా అలీ అనే వ్యక్తికి అసలు ఎటువంటి వ్యవసాయ భూమి లేదని తేలింది.

ఇక పర్చూర్ నియోజకవర్గంలోని చినగంజాంలో ఓ మహిళ కుటుంబ వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు - ఆయన పచ్చ మీడియా మాత్రం దీన్ని వైసీపీ నేతలు చేసిన దారుణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. చంద్రబాబు ఇక్కడ పర్యటించడానికి రెడీ కాగా అసలు విషయం తెలిసి వెనక్కితగ్గాడట..

తాజాగా ధర్మవరంకు చెందిన పక్షపాతం బారిన పడ్డ శివయ్య అనే వ్యక్తి టీడీపీ సమావేశానికి వెళ్లారు. అక్కడ కుట్ర పన్నిన టీడీపీ నేతలు.. వైసీపీ నేతల దాడి వల్లే శివయ్యకు పక్షపాతం వచ్చిందని అతడితో ఒప్పించి ప్రచారం చేశారు. అయితే తాజాగా పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతలు ఇలా తనతో చెప్పించారని శివయ్య చెప్పడంతో టీడీపీ కుట్ర బయటపడింది.

ఇలా ఏపీలో ఏ ఉపద్రవం జరిగినా దాన్ని వైసీపీ నేతలకు అంటగట్టి చంద్రబాబు - టీడీపీ - పచ్చమీడియా చేస్తున్న అరాచకాలపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

   

Tags:    

Similar News