మీరు చదివింది కరెక్టే. ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. పొరపాటుగా రాసింది కూడా కాదు. ఇలాంటి పెళ్లిళ్లు అసలు జరుగుతాయా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. జరిగింది మన దేశంలో కాదు.. సదూర తీరాన ఉన్న మెక్సికోలో. అక్కడ అలాంటి ఆచారం ఉందని.. అందుకే అలాంటి పెళ్లి జరిగిందంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
మెక్సికోలోని మేయర్ పెళ్లి వేడుక ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో ఆసక్తికర అంశంగా మారింది.
దీనికి సంబంధించిన వీడియో.. ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మనిషి కనిపించినంతనే అమాంతంగా ప్రాణాలు తీసే మొసలిని పెళ్లి చేసుకోవటం ఏమిటండి బాబు? ఆ మాటే వణుకు పుట్టిస్తుందని పలువురు అనొచ్చు కానీ.. అక్కడి స్థానిక ఆచారంలో భాగంగా ఈ వివాహ వేడుక జరిగిందని చెబుతున్నారు.
మెక్సికోలోని సాన్ పెడ్రో హ్యుమెలులా ప్రాంతానికి మేయర్ గా వ్యవహరిస్తున్నారు విక్టర్ హుగో. ఆయన ఒక మొసలిని పెళ్లాడటం విచిత్రంగా మారటమే కాదు.. ఆ న్యూస్ అందరిని ఆకర్షిస్తోంది. ఇలా ఎందుకు చేశాడా పెద్ద మనిషి అంటే.. అది అక్కడి ఆచారమని చెబుతున్నారు. శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారట. ప్రకృతిని ఆరాధించటంలో భాగంగానే ఈ పని చేస్తుంటారట.
సమయానికి వర్షాలు పడటం.. అందరికి ఆహారం దొరకాలని.. నదుల్లో చేపలు పుష్కలంగా దొరకాలని.. ఇలాంటి కోరికలు తీరాలంటే ఇప్పుడు చెప్పిన రీతిలో పెళ్లిళ్లు చేసుకోవాలన్నది ఆచారమట. పెళ్లి వేడుకలో భాగంగా పెళ్లి కుమార్తె అయిన మొసలికి వైట్ డ్రెస్ వేశారు. ఇంత చేస్తుంటే.. సదరు మొసలి ఊరుకుంటుందా? అన్న డౌట్ రావొచ్చు. నిజమే.. మొసలి తన సహజసిద్ధమైన పళ్లతో కసిగా కొరికేసి.. ప్రాణాలు తీయకుండా ఉండటానికి వీలుగా.. దాని మూతిని కట్టేసి.. వివాహ తంతు పూర్తి చేశారు.
అక్కడి వారు మొసలిని మహారాణిగా భావిస్తారని చెబుతున్నారు. మొసలిని పెళ్లి చేసుకోవటం ద్వారా ప్రకృతిని మనిషిని ఏకం చేసినట్లుగా భావిస్తారంటున్నారు. మామూలు పెళ్లిళ్ల టైంలో ఎలా అయితే ఎంత హడావుడి ఉంటుందో అదే మాదిరి ఈ పెళ్లి వేడుక జరిగిందని చెబుతున్నారు.
Full View
Full View Full View

పెళ్లి సందర్భంగా పెళ్లి కుమార్తెను వేదిక మీదకు తీసుకొస్తారో.. మూతి కట్టేసి ఉన్న మొసలిని ఇక్కడి వారు జాగ్రత్తగా పట్టుకొని వేదిక మీదకు తీసుకొస్తారట. విశాల ప్రపంచంలో వింతలకు.. విశేషాలకు కొదవ లేదన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఈ ఉదంతం ఉందని చెప్పక తప్పదు.