ఇక బాబాగారి ఎరువులు.. దాణా.. పాలు

Update: 2016-06-13 09:18 GMT
జనాలకు యోగా గొప్పతనం గురించి బోధించే బాబా.. వ్యాపారం చేస్తే? అసలీ ఐడియాను ఎవరూ ఒప్పుకోరు. ఒప్పుకున్నా.. ఆ.. ఏం చేస్తార్లే అని పెదవి విరవటం ఖాయం. కానీ.. బాబాలు వ్యాపారాలు చేస్తే వ్యాపార ప్రత్యర్థులకు ఎంత వణుకు అన్నది యోగా గురువు రాందేవ్ బాబా తాజాగా తన చేతల్లో చూపిస్తున్నారు. పతంజలి పేరిట ఆయన విడుదల చేస్తున్న ఉత్పత్తులకు భారీగా ఆదరణ లభించటమే కాదు.. ఆయన దెబ్బకు యూని లివర్స్.. కాల్గెట్ లాంటి కంపెనీలు సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి.

ఇలా కొమ్ములు తిరిగిన కంపెనీలకు సైతం తనదైన శైలిలో సినిమా చూపిస్తున్న రాందేవ్ బాబా తాజాగా మరిన్ని రంగాల్లో అడుగు పెట్టాలని డిసైడ్ చేయటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న రంగాలకు అదనంగా ఎరువులు.. పశువుల దాణాతో పాటు పాలు కూడా అమ్మాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

పాలతో పాటు పాల ఉత్పత్తులు.. పశువుల దాణా.. ప్రకృతి సిద్ధమైన ఎరువుల్ని కూడా మార్కెట్ లోకి విడుదల చేయాలని భావిస్తున్నారట. కల్తీ లేని పాలు.. పాల ఉత్పత్తులు అందించటంతోపాటు.. రైతులకు సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి పతంజలి ఉత్పత్తుల దేశ వ్యాప్త టర్నోవర్ రూ.10వేల కోట్లకు చేరనున్నట్లు చెబుతున్నారు. ఇంత భారీ వ్యాపారం ఒక యోగా గురువు.. బాబు చేస్తున్నారంటే ఆశ్చర్యకరమే కదూ..?
Tags:    

Similar News