దేశంలో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలపై సెలబ్రిటీలు స్పందించటం మొదలు పెట్టారు. ఉగ్రవాది అఫ్జల్ గురును కీర్తించటం.. అతడి వర్థంతిని ఘనంగా ఢిల్లీలోని జేఎన్ యూలో జరపటం.. దాన్ని ప్రశ్నిస్తున్న వారిని.. భావస్వేచ్ఛను అడ్డుకుంటున్నారని అడ్డదిడ్డంగా మాట్లాడటం లాంటివి జరగటం తెలిసిందే. జేఎన్ యూలో కొందరు విద్యార్థులు చేసిన పనుల్ని.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కమ్యూనిస్ట్ అగ్రనేతలు దన్నుగా నిలవటంతో ఈ ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారింది.
జేఎన్ యూలో అఫ్జల్ గురు వర్థంతిపై సాగుతున్న రచ్చకు సంబంధించి తాజాగా రెజ్లర్ యోగేశ్వర్ దత్ తన కవితను ట్వీట్ రూపంలో పెట్టటం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. మనసును కదిలించేలా కవిత రాసిన యోగేశ్వర్.. ఉగ్రవాది అయిన అఫ్జల్ గురు అమరుడైతే.. మరి.. హనుమంతప్ప.. లాన్స్ నాయక్ ఎవరు? పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ ను అమరుడని వ్యాఖ్యానిస్తున్నారు. మరి.. లాన్స్ నాయక్ ను.. హనుమంతప్పను ఏమని పిలవాలి? ఏ దేశంలో మీరు పుట్టారో.. దాన్నే శత్రువంటున్నారంటూ హిందీలో సాగిన ఆయన కవిత ఇప్పుడు పలువురు దృష్టికి ఆకర్షిస్తోంది.
యోగేశ్వర్ పెట్టిన కవితకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన కవితను రీట్వీట్ చేస్తున్నారు. రింగ్ లో తన పంచ్ తో ప్రత్యర్థికి చుక్కలు చూపించే యోగేశ్వర్ దత్.. తన తాజా ట్వీట్ కు.. జేఎన్ యూలో అఫ్జల్ కు మద్దుతుగా మాట్లాడుతున్న రాహుల్.. కమ్యూనిస్ట్ అగ్రనేతలు ఏం బదులిస్తారు..?