రాహుల్‌ ను అలా ఎందుకు పిలుస్తారంటే..

Update: 2017-10-13 17:20 GMT

రాహుల్ గాంధీ.. 40 ఏళ్లు పైబ‌డినా ఆయ‌న్ని కొంద‌రు ఇంకా తల్లిచాటు బిడ్డ అనే అంటారు! రాజ‌కీయాల్లోకి వ‌చ్చి చాలా ఏళ్లు అయినా.. ఇంకా `అ.. ఆ`లు దిద్ద‌డం దగ్గ‌రే ఉండిపోయారని విమ‌ర్శిస్తారు!! మ‌రికొంద‌రు మ‌రీ ముద్దు గా `ప‌ప్పు` అని ఎద్దేవా చేస్తారు! త‌న అప‌రిప‌క్వ మాట‌ల‌తో నిత్యం ఏదో వివాదంలో చిక్కుకుంటున్నారు రాహుల్‌! వీలుదొరికినప్పుడ‌ల్లా  త‌న ప్ర‌జ్ఞాపాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించి.. త‌న‌ను `పప్పు` అని పిల‌వ‌డంలో ఏమాత్రం అబద్దం లేద‌ని నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఆర్ ఎస్ ఎస్‌ పై ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే చేసి దుమారం రేపారు. దీనిపై రాహుల్‌ కు గ‌ట్టి స‌మాధాన‌మే ఇచ్చారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌!!

ఆర్ ఎస్ ఎస్‌ - రాహుల్ గాంధీ మ‌ధ్య పోరు కొన‌సాగుతూనే ఉంది. `గాంధీని చంపింది ఆర్ ఎస్ ఎస్` అంటూ గ‌తంలోనే ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం.. ఈ వ్య‌వ‌హారం కోర్టుల వ‌రకూ వెళ్ల‌డం తెలిసిందే ఇప్పుడు మ‌రోసారి రాహుల్ ఇలాంటి వ్యాఖ్య‌లే చేసి క‌ల‌క‌లం రేపారు. సంఘ్‌లో నిక్క‌ర్ల‌తో మ‌హిళ‌ల నెప్పుడూ చూడ‌లేదు. ఆర్ ఎస్ ఎస్‌ లో షాట్‌ లో మ‌హిళ‌ల‌ను తాను చూడ‌లేదంటూ నోరుజారారు. దీనిపై యోగి ఆదిత్యానాథ్ తీవ్రంగా స్పందించారు. అపరిపక్వతతో కూడిన వ్యాఖ్యలు చేయటం వల్లనే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిని అందరూ `పప్పు` అంటున్నారని యోగి ఆదిత్యనాథ్‌ ఎద్దేవా చేశారు.

రాహుల్‌ నోటి వెంట వచ్చే అలాంటి మాటలే ఆయన పరిపూర్ణత సాధించలేదనటానికి నిదర్శనమని ప్రజలు భావించి పప్పు అని అంటున్నారన్నారు. రాహుల్‌ గాంధీ వెళ్లిన ప్రతిచోటా కాంగ్రెస్‌ పార్టీకి ఓటమి తథ్యమన్నారు. మరోవైపు రాహుల్‌ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ మాటలు అసభ్యకరంగా ఉన్నాయన్నారు. రాహుల్ ఇప్ప‌టికైనా ప‌రిణ‌తిని ప్ర‌ద‌ర్శిస్తారో లేక ఇంకా తన అజ్ఞానాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు తీవ్రంగా శ్రమిస్తారో వేచిచూడాల్సిందే!!
Tags:    

Similar News