ఒమిక్రాన్ సాధారణ వైరల్ ఫీవర్ అన్న సీఎం

Update: 2022-01-04 02:30 GMT
అప్పట్లో కరోనా వచ్చిన కొత్తలో తెలంగాణ సీఎం కేసీఆర్ అదో వట్టి జలుబు జ్వరం అని.. ప్యారాసిటమల్ వేసుకుంటే తగ్గిపోతుందంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తర్వాత కరోనా విజృంభించి లాక్ డౌన్ పడడం.. వేల మంది చనిపోవడంతో సీఎం కేసీఆర్ పై సెటైర్లు పడ్డాయి. ఏపీ సీఎం జగన్ కూడా ఇలాంటి కామెంట్స్ చేసి బుక్కయ్యారు. ఇప్పుడు సేమ్ అచ్చం అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా బుక్కయ్యారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఒమిక్రాన్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ సాధారణమైన ఒక వైరల్ ఫీవర్ అని అన్నారు. డెల్టా వేరియంట్ కంటే ఇది చాలా బలహీనమైందని వివరించారు. అయితే ఏ వ్యాధికైనా జాగ్రత్తగా మసులుకోవడం అవసరం అని చెప్పారు.

ఈ క్రమంలోనే  వైరస్ కట్టడి కోసం నైట్ కర్ఫ్యూ విధించినట్టు తెలిపారు.  యూపీలో ఇప్పటివరకూ 8 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అత్యధిక వేగంతో వ్యాపిస్తూ ప్రపంచాన్నే వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేవలం ఒక సాధారణ వైరల్ ఫీవర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తున్నది ఎంత నిజమో.. అది అంతే బలహీనమైనది అనడం అంతే నిజమని యోగి అన్నారు.ఒమిక్రాన్ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

సెకండ్ వేవ్ తో పోల్చితే ఒమిక్రాన్ వేరియంట్ చాలా బలహీనం అనేది కూడా అంతే నిజం అని యోగి అన్నారు. భయపడాల్సిన అవసరం లేదన్నారు.

గత ఏడాది మార్చి-ఏప్రిల్ లో డెల్టా వేరియంట్ తో సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభించిన సంగతి తెలిసిందే. ఈ సెకండ్ వేవ్ ను తాజాగా యోగి గుర్తు చేశారు. డెల్టా వేరియంట్ బారినపడ్డ పేషెంట్లు.. కోలుకోవడానికి 15-25 రోజులు పట్టిందని సీఎం అన్నారు.  అప్పుడు డెల్టా వేరియంట్ నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యల బారిన పడ్డారని వివరించారు. కానీ ఒమిక్రాన్ పరిస్థితి భిన్నమైనదని అన్నారు.

ఒమిక్రాన్ భిన్నంగా కనిపిస్తున్నదని సీఎం యోగి అన్నారు. ఈ వైరస్ చాలా బలహీనమైనదని వివరించారు. ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలని సూచించారు. వైరస్ కట్టడి కోసం ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ప్యూ విధించామని తెలిపారు.
Tags:    

Similar News