మళ్లీ మోదీ స్పెషల్ లుక్: వస్త్రాధారణపై యూత్ ఫోకస్

Update: 2020-06-20 14:30 GMT
రాజకీయ నాయకులు ప్రజలను విశేషంగా ప్రభావితం చేస్తారు. వారి వేషభాషలు అన్నింటినీ చూసి ప్రజలు ఆసక్తి పెంచుకుంటారు. ముఖ్యంగా వారి వేషధారణ కూడా ఆసక్తిగా చూస్తుంటారు. ఇప్పటి రాజకీయాల్లో మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వేషధారణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. అతడి వేషాలంకరణ అందరి దృష్టిలో పడుతుంది. విదేశీ పర్యటనలు.. దేశంలో చేసే సమావేశాలకు మోదీ ప్రత్యేకంగా కనిపించేలా చూసుకుఃటారు. ఇక స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి డ్రెస్, తలపాగ భిన్నంగా ఉంటాయి.

ఆయన మానియా రాజకీయాల్లో కి వచ్చినప్పటి నుంచి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. తాజాగా ఇటీవల రెండు రోజుల పాటు ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో డ్రెస్సులో అందరినీ ఆకర్షించారు. సమావేశం అనంతరం విడుదల చేసిన ఫొటోల్లో మోదీ మెరుస్తూ కనిపించారు. తెల్ల జుట్టు, తెల్ల గడ్డానికి రంగు వేయకుండా అలా వదిలేయడం మోదీ స్టైల్ గా మారింది. లాక్ డౌన్ సమయంలో మెడ చుట్టూ పైకండువా లాంటి వస్త్రాన్ని చుట్టుకోవడం ఆకర్షించింది.

చైనా వ్యవహారంలో దేశంలోని విపక్షాలతో జరిపిన సమావేశంలోనూ మోదీ మరో లుక్ లో కనిపించి హైలెటయ్యారు. ఇప్పుడు మోదీ కూడా తన లుక్ పూర్తిగా మార్చేశారు. నెటిజన్లు మాత్రం ఈ కొత్త లుక్ ని పూర్తిగా యాక్సెప్ట్ చేశారు. మోదీ కొత్త స్టైల్ పై పాజిటివ్ కామెంట్స్ పడుతున్నాయి.

ఇప్పుడు మోదీ కుర్తా పైజామా దానిపై ఓ కోట్ యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏ ఫంక్షన్ లో చూసినా ఈ మోదీ డ్రెస్ కనిపిస్తోంది. ఆ తర్వాత ఖాళీ కుర్తా పైజామా, తలపాగ (పగ్డీ) ధరిస్తూ మోదీని అనుసరిస్తున్నారు. ఈ డ్రెస్ లను యువతులు కూడా ఫాలో కావడం విశేషం. ప్రస్తుతం మార్కెట్ లో మోదీ డ్రెస్ విక్రయాలు భారీగా జరుగుతున్నాయి.
Tags:    

Similar News