వైఎస్ జగన్ పాదయాత్రలో అరుదైన మైలురాయి

Update: 2018-07-08 07:06 GMT
‘రాజన్న’ రాజ్యం కోసం ఆ పాదం కదిలింది. అధికార పార్టీ అరాచకపాలనకు చరమగీతం పాడేందుకు ఆయన ముందడుగు వేశారు.  ప్రజల ఆశీర్వాదమే తోడుగా.. నీడగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలు పెట్టారు. వైఎస్ఆర్ పాలనను తిరిగి తెస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ఆదివారం మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

ఆశేష జనవాహిని తోడుగా.. కార్యకర్తల బలమే ఆయుధంగా సాగుతున్న వైఎస్ జగన్  ప్రజాసంకల్ప పాదయాత్ర.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని పులసపూడి వంతెన వద్ద 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఈ మైలురాయికి గుర్తుగా అక్కడ ఓ మొక్కను నాటారు.

గతేడాది నవంబర్ 6న ఇడుపుల పాయ నుంచి వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.. పాదయాత్రలో భాగంగా జూన్ 12న తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. దివంగత ముఖ్యమంత్రి - మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతి రోజున జగన్ ఈ మైలురాయి దాటడం విశేషంగా చెప్పవచ్చు.

* కిలోమీటర్ల వారీగా వైఎస్ జగన్ పాదయాత్ర వివరాలు..

*2500 కిలోమీటర్లు : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పులసపూడి వంతెన వద్ద (జూలై 8 - 2018)

*2000 కి.మీలు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం (మే 14 - 2018)

*1500 కి.మీలు:  గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదూరు (మార్చి 14 - 2018)

* 1000 కి.మీలు : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్ ఆవిష్కరణ (జనవరి 29 - 2018)

*500 కి.మీలు : అనంతపురం జిల్లా ధర్మపురం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్ 16 - 2017)

*100 కి.మీలు : కర్నూలు జిల్లా - ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్ 14 - 2017)

* 0 కి.మీ: పాదయాత్ర మొదలుపెట్టింది వైఎస్ ఆర్ జిల్లా - పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్ 6 - 2017)
Tags:    

Similar News