లోకేష్ ను ఓడిస్తే బంపర్ ఆఫర్: జగన్

Update: 2019-04-09 09:52 GMT
‘లోకల్ హీరో ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ని గెలిపించండి.. చంద్రబాబు కొడుకు లోకేష్ ను ఓడించండి.. నా కేబినెట్ లో ఆర్కేను మంత్రిని చేస్తానంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళగిరి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించిందని.. ఆయన సుపుత్రుడు లోకేష్ ను కూడా ఓడించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. గత ఐదేళ్లుగా ఆర్కే మీకోసమే పనిచేస్తున్నాడని.. ఆర్కేకు ఓటేస్తే మీ ఆస్తులను కాపాడుతాడని.. మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడని.. జగన్ వివరించారు.. ఆర్కే ప్రజలకు రైతులకు కష్టం వస్తే వారి తరుఫున కోర్టుకు వెళతాడని.. తనను కొనేందుకు చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్ినా.. తాను మాత్రం అమ్ముడుపోలేదని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి లోకేష్ ఈ ఐదేళ్లలో ఏనాడు ఇక్కడ కాలు పెట్టలేదని.. ఇక్కడి  భూములను టీడీపీ ఆక్రమించిందని.. అందుకే లోకేష్ ను ఓడించాలని మంగళగిరిలో అందరూ డిసైడ్ కావాలని జగన్ కోరారు.

చంద్రబాబు, ఆయన పార్ట్ నర్ , ఎల్లోమీడియా చేసే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. మంగళగిరిలోనే హ్యాయ్ లాండ్, సింగపూర్ కుంభకోణం, రిషితేశ్వరి మరణం, సదావర్తి భూముల కుంభోకణం , కూలిపోయే సెక్రెటేరియట్, అసెంబ్లీ, చంద్రబాబు అక్రమ నివాసం అంతా మంగళగిరిలోనేనని జగన్ విమర్శించారు. దోపిడీకి నిలువెత్తు నిదర్శనంగా మంగళగిరి కనిపిస్తోందని.. ఆలోచించి ఆర్కేను గెలిపించాలని కోరారు.

చంద్రబాబు పార్ట్ నర్ పోటీచేసే యాక్టర్ నియోజకవర్గాలైన గాజువాక, భీమవరానికి బాబు, లోకేష్ లు వెళ్లరు.. చంద్రబాబు పోటీచేసే కుప్పం, లోకేష్ పోటీచేస్తున్న మంగళగిరికి పార్ట్ నర్ పవన్ రారని.. ఇద్దరూ ఒకే పార్టీనా.. వేర్వేరు పార్టీలా అని జగన్ విమర్శించారు. గోబెల్స్ తరహా ప్రచారంతో చంద్రబాబును గెలిపించడానికి అంతా ఏకమయ్యారని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5 లు ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబు ఓటమి ఖాయమని ప్రజలు నిర్ణయానికి వచ్చారని జగన్ అన్నారు. 10 ఎల్లో మీడియా చానెళ్లు మైక్ పట్టుకొని ప్రచారం చేసినంత మాత్రానా చంద్రబాబు మోసాలు మంచివి అయిపోతాయా అని ప్రశ్నించారు.

మంగళగిరిలో ఓటుకు 10వేలు ఇస్తున్నారని నాకు తెలుస్తోందని.. డబ్బులతో ప్రలోభాలకు గురిచేసినా మోసపోకండని.. జగన్ ప్రజలను కోరారు. ప్రతీ గ్రామానికి వెళ్లి వైసీపీ మేనిఫెస్టోను వివరించండని.. జగన్ గెలిస్తే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పండి అంటూ వైఎస్ జగన్ కోరారు.
    

Tags:    

Similar News