ఏపీ అసెంబ్లీలో కరువు పరిస్థితులపై తీవ్ర స్థాయిలో గందరగోళం చెలరేగింది కరువుపై విపక్ష నేత జగన్ మాట్లాడుతుండగా ఆయన తన ప్రసంగంలో పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. అందుకు కోడెల అనుమతించలేదు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల గురించి నిన్ననే చర్చ అయిపోయినందున ఈ రోజు దాని గురించి మాట్లాడే అవకాశం లేదన్నారు. అయితే జగన్ పదే పదే మాట్లాడుతుండడంతో కోడెల జగన్ మైక్ కట్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
ప్రతిపక్ష నాయకుడు ప్రసంగం వినే ఓపిక లేకపోతే అసలు శాసనసభ ఎందుకని వారు మండిపడ్డారు. వైకాపా సభ్యులందరు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి మరోసారి తమకు అలవాటైన పంథాలోనే నినిదాలు స్టార్ట్ చేశారు. తర్వాత మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్‌బాబు, విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ జగన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు.
తర్వాత మళ్లీ జగన్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చి తిరిగి కరువు చర్చ స్టార్ట్ అయ్యింది. అయినా జగన్ తన పట్టు విడవకుండా పట్టిసీమ, పోలవరం ప్రస్తావన తెచ్చారు. దీంతో కోడెల బెల్ కొట్టి స్పీకర్ కట్ చేశారు. దీనిపై ప్రత్తిపాటి మాట్లాడుతూ రాష్ర్టంలో చంద్రబాబు పాలనలో చాలా తక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని..ఎవరైనా రైతులు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నామని...జగన్‌కు కరువు గురించి మాట్లాడే దమ్ములేకే ఆయన మాటిమాటికి పట్టిసీమ, పోలవరం పేర్లు ఎత్తుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న అసెంబ్లీలో జగన్ లేకపోతే అందుకు ఎవ్వరు బాధ్యులని..మళ్లి ఈ రోజు పట్టిసీమ, పోలవరం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ ఆయన విమర్శించారు.