గత కొన్ని దశాబ్దాలపాటు సంగీత ప్రియులను ఉర్రుతలూగించి, తాజాగా వారందరిని శోకసంద్రంలో పడేసి ఆ మధుర గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అనంతలోకాలకు వెళ్లిపోయారు. దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. సంగీతం, కళలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకుగానూ ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని సీఎం జగన్ తన లేఖలో ప్రస్తావించారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం తమ రాష్ట్రంలో జన్మించడం ఏపీ చేసుకున్న అదృష్టమని సీఎం జగన్ తెలిపారు. ఆయన అకాల మరణం ఎంతోమంది అభిమానులను, ప్రముఖలను కలిచి వేస్తోందని, దేశంతో పాటు ప్రపంచ సంగీత కుటుంబానికే ఇది తీరని లోటు అని అన్నారు. సంగీత ప్రపంచానికి ఆయన 50 ఏళ్ల పాటు సేవలందించారని ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన గౌరవాన్ని పొందారని అన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ, హిందీలో కలిపి బాలసుబ్రమణ్యం 40 వేల పాటలు పాడారని వెల్లడించారు.
ఎస్పీ బాలు సింగర్ గా ఆరు జాతీయ అవార్డులు, ఏపీ ప్రభుత్వం తరపున 25 నంది అవార్డులతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వం ఇచ్చే అవార్డులను సొంతం చేసుకున్నారని , 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులు ఆయనకు వచ్చాయని తెలిపారు. గతంలో ప్రముఖ గాయకులైన లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లా ఖాన్, పండిట్ భీమ్ సేన్ జోషి వంటివారికి భారత రత్న పురస్కారం అందించారని...ఎస్పీ బాలు కూడా అదే కోవకు చెందుతారని వైఎస్ జగన్ గుర్తు చేశారు.