అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి కుండలోని ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు.. కనీసం అయిదు టెర్ములు అధికారంలో ఉంటారని అంతా ఆశిస్తున్న ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పనితీరును కూడా ఇదే తీరుతో కొలుస్తున్నారు ప్రజలు. ఆయన ఆర్నెలల పాలన చూస్తే చాలు వచ్చే పాతికేళ్లు ఎలా పాలిస్తారో.. రాష్ట్రాన్ని ఎలా సుభిక్షంగా మార్చబోతున్నారో అర్థమవుతుందంటున్నారు ప్రజలు.
ఎన్టీఆర్ స్థాయిలో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు నేటితో ఆర్నెళ్లు పూర్తయ్యాయి. 50 శాతానికి పైగా ఓట్లు సాధించి అధికారం చేపట్టిన ఆయన తన పాలన ఎలా ఉండబోతుందో ఆదిలోనే చెప్పేశారు. మ్యానిఫెస్టోలో చెప్పింది చేసి తీరుతామని, హడావుడి పనులు మాని అవసరమైన పనులు చేపడతామని ప్రారంభంలోనే సంకేతాలిచ్చారు. ఈ ఆర్నెల్ల పాలన అదే చెబుతోంది.
‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అంటూ ప్రమాణ స్వీకార ఉపన్యాసం ప్రారంభించిన జగన్మోహనరెడ్డి తాను చెప్పిన అనేక అంశాలను ఇప్పటికే ఆచరణలోకి తెచ్చారు. తొలి ఏడాదే వృద్దుల పింఛన్‌ను మూడువేలకు పెంచుతారని ఆశించినప్పటికీ 250లు మాత్రమే పెంచడం అప్పటికప్పుడు కొందరికి ఆశాభంగం కల్పించింది. కానీ ఆ తర్వాత వరుసగా ఆయన అమలు చేసిన రైతు భరోసా, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, వాహనమిత్ర, నాయీబ్రాహ్మణ మిత్ర వంటి పథకాలు ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచాయి.
పాతికేళ్లు సీఎంగా ఉండాలని..
పెద్ద సంఖ్యలో చేపట్టిన వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం జరగలేదు. ఎవరు ఆరోపణలు చేయలేక పోయారు. ముందుగా విపక్షాలు వీటిపై చేసిన విమర్శలు కూడా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయాయి. జగన్ ముఖ్యంగా గత ప్రభుత్వ వైఫల్యా ల్నుంచి గట్టిగానే గుణపాఠాలు నేర్చుకున్నారు. అటువంటివి పునరావృతమైతే అదే స్థాయి ప్రజా తీర్పు తప్పదన్న నిర్ణయానికొచ్చేశారు. కేవలం ఐదేళ్ళు పాలించి సరిపెట్టుకోవడం కాకుండా కనీసం పాతికేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న దూరదృష్టికనుగుణంగా అడు గులేస్తున్నారు.
ఆర్నెళ్లలోనే అవినీతి భరతం పట్టారు
గతేడాది రాష్ట్రంలో తెలుగు దేశం అధికారంలో ఉండగా అవినీతి ఇండెక్స్ లో దేశంలో ఐదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ శుక్రవారం విడుదలైన తాజా జాబితాలో 13వ స్థానానికి చేరింది. అవినీతిలో పలు రాష్ట్రాల కంటే ఏపీ అతి తక్కువ స్థాయిలో ఉంది. ఈ రాష్ట్రంలో 50 శాతం మంది ఇప్పటికీ పనుల కోసం తాము అధికారులకు ముడుపులిస్తు న్నట్లు ఈ అధ్యయనకార్లకు వెల్లడించారు. అయితే గతేడాది ఇదే నవంబర్‌లో నిర్వ హించిన సర్వేలో 89 శాతం మంది ఇలాంటి బదులిచ్చారు. ఈ ఏడాదిలో అవినీతి శాతం కొద్దిమేరకైనా తగ్గు ముఖం పట్టడం కచ్చితంగా జగన్ ప్రభుత్వం సాధించిన విజయంగానే పరిశీలకులు పరిగణి స్తున్నారు. ఈ ఆరుమాసాల్లో ఏ మంత్రి లేదా ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు రాలేదు. పోలీసులకు సంబంధిం చిన బదలీల్లో ఒకట్రెండు చోట్ల నగదు చేతులు మారిం దన్న సమాచారం నిఘా వర్గాల్నుంచి అందగానే సదరు ఎమ్మెల్యేను పిలిచి జగన్ మందలించారు. తీసుకున్న ముడుపుల్ని తిరిగి చ్చేయాలంటూ ఆదేశించారు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు, ఒకరకరమైన భయమేర్పడింది. సక్రమంగా పనిచేయకపోతే జగన్ తమను పార్టీ నుంచి బయటకు పంపిస్తారన్న భయం ఏర్పడింది.
ఎన్టీఆర్ తరువాత ఆయనే..
ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధానికి హామీ ఇచ్చిన జగన్ దశలవారీగా ఆ హామీ అమలు దిశగా కదులుతున్నారు. రాత్రి 8గంటలకే మద్యం దుకాణాల్ని మూసేస్తుండడంతో మద్య ప్రియులు త్వరగా ఇళ్ళకు చేరుతున్నారు. అనవసర రాద్దాంతాలు, ఘర్షణలు తగ్గాయి. రాష్ట్రంలో బెల్ట్‌షాపులు కనిపించడంలేదు. దీంతో మహిళల్లో జగన్ పట్ల విశ్వాసమేర్పడింది.
అన్ని కులాల జీవన ప్రమాణాల మెరుగుకు ఈ ఆరుమాసాల్లో ప్రయత్నాలు మొదలెట్టారు. అధిక సంఖ్యాకులైన కాపుల పట్లప్రత్యేక శ్రద్ద ద్వారా వార్ని ఆకర్షించే యత్నం చేస్తున్నారు. అలాగే ఉన్నత కులాలుగా పరిగణన పొందుతున్నప్పటికీ ఆర్ధికంగా వెనుకబాటులో ఉన్న కుటుంబాల్ని దృష్టిలో పెట్టుకుని కమ్మ, వైశ్య కార్పొరేషన్లకు శ్రీకారం చుట్టారు.
ఇసుక ఇబ్బంది పెట్టింది
అనేక సానుకూల అంశాలున్నప్పటికీ జగన్ ఈ ఆర్నెల్లలో ఇబ్బంది పడింది ఇసుకతోనే. ప్రకృతి అనుకూలించక ఇసుక కొరత ఏర్పడగా విపక్షాలు దానిని అవకాశంగా తీసుకున్నాయి. అంతకుముందు ప్రభుత్వంలో ఇసుక అక్రమ వ్యాపారులకు వరంగా మారడంతో పాటు వారే ఎన్నికల్లో అప్పటి అధికార పక్షానిక ఆర్ధిక వెన్నుదన్నుగా నిలబడ్డారు. దీంతో ఇసుక విక్రయాల్ని క్రమబద్దీకరించే ప్రయత్నం జగన్ చేపట్టారు. ఈ క్రమంలో పలు ఆరోపణలకు గురయ్యారు. నూతన ఇసుక విధానం పట్టాలెక్కేసరికి వరదలొచ్చాయి. దీంతో అసలు ఇసుకే లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటంబాలు ఉపాధి కోల్పోయాయి. దీంతో టీడీపీ, జనసేన నేతలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. వర్షాలు, వరదల తగ్గగానే ఇసుకను అందుబాటులోకి తేవడంతో పాటు అక్రమాలు, ధరలు నియంత్రించి ఇసుకను తక్కువ ధరకే ప్రజలకు అందేలా చేసింది జగన్ ప్రభుత్వం.
తెలుగు సెంటిమెంటు
పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం బోధనపై జగన్ ప్రబుత్వం తీసుకన్న నిర్ణయం వివాదాస్పదమైంది. మాతృభాష పేరుతో విపక్షాలు సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం చేసినా అవి పెద్దగా ఫలించలేదు.
అమరావతిపై..
రాజధాని అమరావతిని మార్చేస్తారంటూ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం జరిగింది. అయితే.. అనవసరపు హడావుడి, ఆర్భాటపు ఖర్చుల్లేకుండా రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించడంతో ఆ వివాదానికితెరపడింది. రాజధాని విషయంలో రగడ సృష్టించేందుకే విపక్ష నేత ప్రయత్నాలు చేసినా అక్కడి రైతులే దాన్ని తిప్పికొట్టారు.
మొత్తానికి ఆర్నెళ్ల కాలంలో జగన్ విపక్షాలు సృష్టించిన ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. తాను చేస్తానని చెప్పిన పనులలో కొన్ని ఇప్పటికే ప్రారంభించి.. మరికొన్ని ఎప్పుడు ప్రారంభించేదీ స్పష్టంగా ప్రకటించి రాష్ట్ర ప్రజల మనసులో నమ్మకం సంపాదించుకున్నారు. దీంతో ఇతర పార్టీల నేతలు తమకు మళ్లీ అధికారం రావడం కలేననన్న అభిప్రాయానికి వస్తున్నారు. - VS Rao