ఇవాల్టి రోజున ఒక పేపర్ మాత్రమే చదవటం లేదు. రెండు చదవటం కామన్ గా మారింది. కొందరైతే మూడు చదివేటోళ్లు ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఏ మీడియా సంస్థకు ఆ మీడియా సంస్థ తమ లైన్ కు తగ్గట్లుగా వార్తల్ని రాయటం ఎక్కువైంది. స్పాట్ లో జరిగిన విషయాన్ని.. ఎవరైనా ప్రముఖుడు.. తన ఇంటర్వ్యూలో భాగంగా జవాబులు చెబితే.. వాటిల్లో చెప్పిన అంశాన్నే హైలెట్ చేయాలి. కానీ.. తమకు తోచిన.. తమకు సూట్ అయ్యేలా సదరు ప్రముఖుడు చెప్పిన మాటల్ని తప్పుగా అన్వయించుకునే ధోరణి అంతకంతకూ పెరుగుతోంది.
ఎక్కడిదాకానో ఎందుకు ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ పీఠం మీద ఎవరు కూర్చునేది డిసైడ్ చేయటంలో దక్కన్ ప్రాంత పాత్ర పేరిట జరిగిన కార్యక్రమంలో ఒక ముఖాముఖికి జగన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే.. ఈ సమధానాలకు ఎవరికి వారు..ఏ మీడియాకు ఆ మీడియా తనకు తోచినట్లుగా.. తనకు నచ్చినట్లుగా హెడ్డింగులు పెట్టుకున్నారు. ఇంతకీ జగన్ ఏం చెప్పారు? ఆయనేం సమాధానాలు ఇచ్చారు? అన్నది చూస్తే.
+ పాదయాత్ర ప్రజలకు ఒక విశ్వాసం కల్పించింది. ప్రజలను అర్థం చేసుకోవడం, వారు చెప్పేది వినడం, వారి పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. పాదయాత్రలో ఆద్యంతం వారి సమస్యలపై గళం వినిపించాం. తద్వారా ప్రభుత్వం ఆయా సమస్యలను పరిష్కరించేలా చేశాం. తమ సమస్యలను వినేందుకు ఒకరు ఉన్నారు.. ఏదైనా చేసేందుకు అండగా వస్తున్నారు.. అంటే అది ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది. ఆ నమ్మకమే నన్ను కూడా ముందుకు నడిపించింది.
+ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలన్న నా కలలో ఒక ఉద్దేశం ఉంది. నేను చనిపోయినా అందరి మనసుల్లో బతికే ఉండాలన్నది నా కల. అది నా లక్ష్యం. ఆరు నెలల సహవాసం చేస్తే వారు వీరవుతారని అంటారు. 14 నెలలు ప్రజల మధ్య నడిచాను. పగలూ రాత్రి వారు పడ్డ కష్టాలను చూశాను. ఆ కాలమంతా నన్ను వైవిధ్యంగా మలిచిన ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపన కలిగింది.
+ పాదయాత్రలో చాలా వరకు నేను చూసిన సమస్యల్లో అనేకం మానవ తప్పిదాలే. అమలు చేయలేని హామీలను మనం ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయతను కోల్పోయారు. ఆయన అనేక అబద్ధపు హామీలు ఇచ్చారు. ఈయన అబద్ధాల కారణంగా ప్రజలు ఈరోజు తీవ్ర దుఃఖంలో ఉన్నారు.
+ రైతుల విషయమే చూద్దాం. రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. ఏ రాష్ట్రం కూడా ఆమేరకు సామర్థ్యం కలిగి ఉండదని ఆయనకు తెలిసి కూడా హామీ ఇచ్చారు. రుణాలు కట్టొద్దని చెప్పారు. రైతులు రుణాలు కట్టడం ఆపేశారు. దీంతో (వడ్డీ లేని రుణాలు పొందకుండా చేశారు. ఈ ఘనత చంద్రబాబు పాలనకే దక్కింది.
+ విభజన బిల్లును ఆమోదించే రోజున.. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ.. అందరూ సభ సాక్షిగా ఒక్కటయ్యారు. పార్లమెంట్ తలుపులు మూసేశారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు. విభజనను అడ్డుకున్న సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. రాజ్యసభలో అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీజేపీలు ఒక్కటయ్యాయి. విభజన కోరుకున్న రాష్ట్రం రాజధానిని తీసుకోవడం ఈ ఒక్క విభజనలోనే జరిగింది. ఈ రోజు మా రాష్ట్ర విద్యార్థులు పట్టభద్రులైతే ఉద్యోగానికి ఎక్కడికి వెళ్లాలో తెలియని దుస్థితి నెలకొంది.
+ హోదా ఈశాన్య రాష్ట్రాలకు.. జార్ఖండ్ లాంటి వెనుకబడినరాష్ట్రాలకు ఇవ్వాలన్న డిమాండ్ వస్తుందని.. రాష్ట్ర విభజన జరిగిన రోజు వాళ్లకు తెలియవా? ఆ రోజు జార్ఖండ్ వెనుకబడి లేదా? విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక హోదా రూపంలో పరిహారం ఇస్తామని పార్లమెంట్‌లో అధికార కాంగ్రెస్‌తో పాటు, ప్రతిపక్ష బీజేపీ కలిసి చెప్పాయి.
+ ఇవాళ మాట నిలబెట్టుకోకుండా జార్ఖండ్ - ఛత్తీస్ గఢ్ లు ఏపీ కంటే వెనుకబడి ఉన్నాయి కాబట్టి హోదా ఇవ్వలేమంటున్నారు. మరి పార్లమెంటులో మాట ఎందుకు ఇచ్చినట్టు? అలా చేస్తే పార్లమెంట్ పై విశ్వసనీయత ఎలా ఉంటుంది?
+ మేము ఇప్పటికే తటస్థంగా ఉన్నాము. మా డిమాండ్ ప్రత్యేక హోదా ఒక్కటే. జగన్ అయినా, ఏపీ ప్రజలైనా ‘ఢిల్లీ’మాటలు నమ్మి మోసపోయాం. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిన వారు మరచిపోయారు. ఇవన్నీ చూసి విసుగెత్తిపోయాం. మేం ఓపెన్ గా ఉన్నాం. హోదా ఇచ్చిన వాళ్లకే మద్దతు ఇస్తామని చెప్పాం.
+ కచ్చితంగా.. ప్రధాని ఎవరన్నది మాకు అనవసరం. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తాం. మీరు (జర్నలిస్ట్ రాహుల్ ను ఉద్దేశించి) ప్రధాని అయినా మద్దతు ఇస్తాం.
+ నేను రాహుల్ గాంధీకో - మరొకరికో వ్యతిరేకం కాదు. మా లక్ష్యం చాలా సూటిగా ఉంది. మేం ఎవరినీ నమ్మం. ఇప్పటికే ఐదేళ్లు నష్టపోయాం. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. మేం మద్దతు ఇస్తాం. మా ఆప్షన్లన్నీ ఓపెన్‌గా పెట్టుకున్నాం. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాలనుకోవడం లేదు.
+ కాంగ్రెస్ కు దానిపై దానికే నమ్మకం లేదు. వారికి విశ్వాసం ఉంటే వారు టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు. 30 ఏళ్లు కాంగ్రెస్‌పై పోరాడిన టీడీపీతో వారు పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు అవినీతిపై 2018 జూన్ 8న కాంగ్రెస్ ‘అత్యంత అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు’అనే పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేసింది. దానిపై రాహుల్ గాంధీ బొమ్మ కూడా ప్రచురించింది. ఇది విడుదల చేసిన మూడు నెలల్లోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీ కలిసి పోయి ఎన్నికల్లో పోటీ చేశాయి. ప్రజలు ఏమనుకుంటారన్న స్పృహ కూడా వారికి లేదు.
+ రాహుల్.. మోడీ ఏపీకి ఇద్దరూ వెన్నుపోటు పొడిచారు.
+ మేం అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిన పరిస్థితి. ఇది క్యాచ్ – 22 పరిస్థితి (వైరుధ్య పరిస్థితులు ఉన్నా కొనసాగించాల్సిన పరిస్థితి). ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అనేది పెద్ద కుంభకోణం. చంద్రబాబు 2014 జూన్ లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసు. కానీ అక్కడ, ఇక్కడ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. సరిగ్గా రాజధాని ఏర్పాటయ్యే చోట సొంత హెరిటేజ్ కంపెనీ పేరుతో - బినామీల పేరుతో అక్కడి రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు.
+ మాకు ఎందుకు హోదా ముఖ్యమంటే.. హైదరాబాద్ తోగానీ - చెన్నైతోగానీ - బెంగళూరుతో గానీ పోటీ పడే వనరులు లేవు. హైదరాబాద్ అభివృద్ధికి 60 ఏళ్లు పట్టింది. ఈరోజు ఒక పట్టభద్రుడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియదు. హోదా వస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు వస్తాయి. 100 శాతం ఆదాయపు పన్ను రాయితీ, వంద శాతం జీఎస్టీ రాయితీ లభిస్తుంది. ఇలాంటి పారిశ్రామిక ప్రత్యేక ప్రోత్సాహకాలతోనే ఎవరైనా ముందుకొచ్చి హోటలో - ఆసుపత్రో - ఐటీ సంస్థనో - కర్మాగారమో ఏర్పాటు చేస్తారు. పక్కనే హైదరాబాద్ ఉంది. అక్కడ అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. ఇప్పుడు మాకంటే హైదరాబాద్ - చెన్నై - బెంగళూరు అత్యంత ముందంజలో ఉండగా ఎవరైనా ఏపీకి వచ్చి ఎందుకు పెట్టుబడులు పెడతారు?
+ చంద్రబాబును జైలుకు పంపదలుచుకున్నారంటే అంటే.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఓత్ ఆఫ్ సీక్రెసీని ఉల్లంఘించడమే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను - రహస్యాలను కాపాడతానని - గోప్యం పాటిస్తానని ప్రమాణం చేస్తారు. కానీ చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాల కోసం వాటిని భంగపరిచారు. తన కంపెనీ హెరిటేజ్ పేరుతో భూములు కొన్నారు. బినామీల పేరుతో కొన్నారు.
+ బాబు.. ఆయన బినామీలు ఏమంటారంటే రాజధానికి భూములే సేకరించలేదని చెబుతారు. భూ సమీకరణ పేరుతో భూములు సేకరించారు. అలా సేకరించిన భూములను వారికి ఇష్టమొచ్చిన వారికి - వారికి ఇష్టమొచ్చిన ధరలకు ఇచ్చారు. 1600 ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చేశారు.
+ చివరలో ఒక్క మాట.. తెలంగాణలో ఎమ్మెల్యేలను తన బ్లాక్ మనీతో కొంటూ ఆడియో - వీడియో టేపులతో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇలాంటి నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా? ఆ టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతే అని ఫోరెన్సిక్ పరీక్షలో కూడా తేలింది. అయినా ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదు. ఎలాంటి కేసు నమోదు కాలేదు. కాబట్టి వాస్తవం ఏమిటన్నది ఆలోచించాలి.