జగన్.. లోకేశ్ ల మధ్య లెక్కల ఫైటింగ్

Update: 2016-11-08 02:56 GMT
చూసేందుకు ఉత్తర.. దక్షిణ ద్రువాలుగా కనిపించినప్పటికీ ఇద్దరు ముఖ్యనేతల కుమారులకు సంబంధించి చాలానే పొలికలు కలిసేలా ఉంటాయి. దివంగత మహానేత వైఎస్ కుమారుడు కమ్ వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు కమ్ టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ఇద్దరు నేతలు ఆయా పార్టీల ముఖ్యనేతల  వారసులే కాదు.. ఇరువురి బ్యాక్ గ్రౌండ్ లో బిజినెస్ కీలకంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో వచ్చినప్పటికీ.. కాస్త టైం చిక్కితే వ్యాపారం మీద వీరి ఫోకస్ కనిపిస్తుంది. రాజకీయాల్లో వీరి సక్సెస్ రేటు ఎంతన్న విషయాన్ని పక్కన పెడితే వ్యాపారవేత్తలుగా ఎవరికి వారు విజయవంతమయ్యారని చెప్పాలి.

రాజకీయాల్లోకి ఎంట్రీ ముందు వ్యాపారపరంగా వారుతమ సత్తా చాటినట్లే. రాజకీయ అధినేత వారసులుగా రాజకీయాల్లో తమ సత్తా చాటాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా పారిశ్రామికవేత్తలుగా పేరు తెచ్చుకున్నారు. గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న వ్యవహారాలు చూస్తే.. ఈ ఇద్దరు నేతలు రాజకీయ విమర్శలు వదిలేసి.. వ్యాపార లెక్కలతో కూడిన విమర్శలు చేసుకోవటం స్పష్టంగా కనిపిస్తుంది.

సాధారణంగా రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేసుకుంటుంటారు. తాజా ఎపిసోడ్ లో మాత్రం జగన్.. లోకేశ్ ల మధ్య వ్యాపార అంశాలపై ఆరోపణలు చేసుకోవటం కనిపిస్తుంది. ఆదివారం విశాఖలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభ సందర్భంగా ఏపీలో గడిచిన రెండున్నరేళ్లలో బాబు ఫ్యామిలీ తప్ప బాగుపడినోళ్లు లేరంటూ తీవ్రంగా మండిపడ్డ జగన్.. తన ఆరోపణలకు ఉదాహరణగా హెరిటేజ్ గ్రాఫ్ ను ప్రస్తావించారు. హెరిటేజ్ షేర్ నాలుగు వందల శాతం వృద్ధి కనిపించదని చెప్పిన ఆయన.. హెరిటేజ్ తప్ప రాష్ట్రంలో బాగు పడిందేమీ లేదంటూ తేల్చేశారు.

దీనికి కౌంటర్ గా లోకేశ్ మాట్లాడుతూ.. జగన్ అర్థం కాని మాటలు మాట్లాడుతున్నారన్న ఆయన.. జగన్ మాదిరి ఎలాంటి ఉత్పత్తి చేపట్టకముందే షేర్లు అమ్ములోలేదన్నారు. పేపర్ ప్రింట్ కాక ముందే సాక్షి షేర్లు అమ్ముకున్నారని విమర్శించారు. బ్లాక్ మనీని వైట్ ఎలా చేసుకోవాలో జగన్ దగ్గర నేర్చుకోవాలని తీవ్రస్థాయిలో ఎద్దేవా చేయటం గమనార్హం. ఇరువురు రాజకీయ నేతల మధ్య వాదులాట.. విమర్శలు.. ఆరోపణలు..రాజకీయాల చుట్టూ తిరుగుతాయి. కానీ.. జగన్.. లోకేశ్ ల విసయంలో మాత్రం అందుకు భిన్నంగా వారి.. వారి వ్యాపార లెక్కలు తెర మీద రావటం ఆసక్తికరమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News