చంద్రబాబు సర్కారు తీసుకుంటున్న చట్టవిరుద్ధమైన నిర్ణయాలపై జగన్ అగ్గి ఫైర్ అయ్యారు. కోట్లాది రూపాయిల విలువైన భూముల్ని కారుచౌకగా కట్టబెట్టేస్తున్న వైనాన్ని సూటిగా ప్రశ్నించటమే కాదు.. ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. రుజువులతో సహా ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏమేం తప్పులు చేస్తుందన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా జగన్ చెప్పుకొచ్చారు.
ఎకరం రూ.70 కోట్లు విలువ చేసే భూముల్ని సిద్దార్థ విద్యా సంస్థలకు కారుచౌకగా ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించిన ౠయన.. ఎకరాన్ని కేవలం రూ.1.5లక్షల లీజుకు రాటిఫై చేయటం ఏమిటంటూ ప్రశ్నించారు. 2006లో ప్రభుత్వం లీజును రద్దు చేస్తే.. 2010లో హైకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. పదిశాతం మార్కెట్ విలువకు ఆస్తి లీజుకు ఇస్తే ఫర్లేదన్న ఆయన రూ.7కోట్ల లీజుకు ఇస్తే అభ్యంతరం ఉండదన్నారు. ఇదే తీరులో సదావర్తి భూముల విషయంలోనూ ఏపీ సర్కారు వ్యవహరించిందని మండిపడ్డారు.
మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.7కోట్లు విలువ చేసే సదావర్తి భూముల్ని కేవలం రూ.22లక్షలకు అమ్మేయటం ఏమిటంటూ ప్రశ్నించిన జగన్.. అన్యాక్రాంతం కాని 83 ఎకరాల విషయంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. కారుచౌకగా భూముల్ని అమ్మేస్తున్న విషయంపై దేవాదాయ ప్రాంతీయ కమిషనర్ లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆయన.. సదావర్తి భూముల్ని అప్పనంగా కట్టబెట్టేశారన్నారు. సదావర్తి భూముల పాపం చంద్రబాబు సర్కారుకు తగలటం ఖాయమని వ్యాఖ్యానించారు. భూముల అమ్మకాలు.. లీజుకు ఇచ్చే విషయంలో బాబు సర్కారు చేస్తున్న తప్పుల్ని జగన్ ఎత్తి చూపిన తీరుతో ఏపీ అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/